ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులతో సమానంగా మాజీ సైనికోద్యోగుల అర్హత మార్కులను తగ్గించాలని..సైనిక్ సంక్షేమ డైరెక్టర్ రాసిన లేఖపై నిర్ణయం తీసుకునేంత వరకు ఎక్స్ సర్వీస్ మెన్ కోటా పోస్టులను భర్తీ చేయరాని టీఎస్ పీఎస్సీకి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది హైకోర్టు. గ్రూప్ లో 4 నోటిఫికేషన్ లో మాజీ సైనికోద్యోగుల అర్హత మార్కుల తగ్గింపుపై నిర్ణయం తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ..దాఖలైన పిటిషన్ పై జస్టిస్ మాధవీదేవి విచారణ జరిపారు. ఎక్స్ సర్వీస్ మెన్ కోటా కింద ఎంతో మంది రాత పరీక్షలకు హాజరైనట్లు తెలిపారు. దీంతో సైనిక సంక్షేమ డైరెక్టర్ లేఖపై నెలరోజుల్లోగా తుది నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర సర్కార్ ను , టీఎస్పీఎస్సీని హైకోర్టు ఆదేశించింది. విచారణను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.
పూర్తిగా చదవండి..TSPSC Group-4: గ్రూప్-4 ఫలితాలపై హైకోర్టు కీలక ఆదేశాలు..!!
తెలంగాణలో గ్రూప్ 4 ఫలితాలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులతో సమానంగా మాజీ సైనికోద్యోగుల అర్హత మార్కులను తగ్గించాలని..సైనిక్ సంక్షేమ డైరెక్టర్ రాసిన లేఖపై నిర్ణయం తీసుకునేంత వరకు ఎక్స్ సర్వీస్ మెన్ కోటా పోస్టులను భర్తీ చేయవద్దని టీఎస్ పీఎస్సీకి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది హైకోర్టు.

Translate this News:











