Telangana Weather Updates: ఎండ, ఉక్కపోతతో అల్లాడుతున్న తెలంగాణ(Telangana) జనాలకు శుభవార్త చెప్పింది వాతావరణ శాఖ(IMD). రాగల మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలుకురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. గురు, శుక్ర, శనివారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అంతేకాదు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, దీనికి తోడు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందన్నారు. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ప్రధానంగా మహబూబ్నగర్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
పూర్తిగా చదవండి..Telangana Weather: తెలంగాణకు బిగ్ అలర్ట్.. మూడు రోజులు భారీ వర్షాలే..
ఎండ, ఉక్కపోతతో అల్లాడుతున్న తెలంగాణ జనాలకు శుభవార్త చెప్పింది వాతావరణ శాఖ. రాగల మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలుకురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.

Translate this News:











