Anantnag Encounter: కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో బుధవారం ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో ఆర్మీ కల్నల్, జమ్మూ కాశ్మీర్ పోలీసు మేజర్, డీఎస్పీ వీరమరణం పొందారు. ఈ ఎన్కౌంటర్లో వీరమరణం పొందిన వారిలో 19 రాష్ట్రీయ రైఫిల్స్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ మన్‌ప్రీత్ సింగ్ (Colonel Manpreeet Singh), మేజర్ ఆశిష్ ధోనక్ (Major Ashish Dhonak), డీఎస్పీ హుమాయున్ భట్ ఉన్నారు. హుమాయున్ భట్ తండ్రి జమ్మూ కాశ్మీర్ పోలీస్‌లో ఐజీగా పనిచేశారు. ఈ ఘటనతో దేశవ్యాప్తంగా ఆగ్రహ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో బుధవారం రాష్ట్రీయ బజరంగ్ దళ్ సభ్యులు పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీనికి సంబంధించి, బజరంగ్ దళ్ కార్యకర్తలు కొవ్వొత్తులు చేతపట్టుకుని పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ అసంతృప్తిని వ్యక్తం చేసిన వీడియోను వార్తా సంస్థ PTI షేర్ చేసింది.
పూర్తిగా చదవండి..Anantnag Encounter : దేశంకోసం ప్రాణాలు వదిలిన ఈ డీఎస్పీ కథ వింటే ఖచ్చితంగా సెల్యూట్ చేస్తారు..!
మంగళవారం అనంత్‌నాగ్‌లో సైనికులు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్కౌంటర్లో కల్నల్ మన్‌ప్రీత్ సింగ్, మేజర్ ఆశిష్ ధోనక్, జమ్మూ కాశ్మీర్ డీఎస్పీ హుమయూన్ భట్ వీరమరణం పొందారు. హుమాయున్ భట్‌కి రెండు నెలల కుమార్తె ఉంది. ఆయన తండ్రి కూడా ఐజీగా సేవలందించి రిటైర్ అయ్యారు. కాగా అటు ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు జవాన్లు వీరమరణం పొందడంపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. కాగా, రాష్ట్రీయ బజరంగ్ దళ్ కార్యకర్తలు 'పాకిస్థాన్ డౌన్', 'షహీద్ జవాన్ అమర్ రహే' అంటూ నినాదాలు చేశారు.

Translate this News:











