Telangana Elections 2023: 2 వేల సంవత్సరాల నుంచి ఆకలి దప్పికతో ఉన్నాం.. ఇక బహుజన సమాజం తమ సత్తా చాటే సమయం వచ్చింది.. మన అధికారాన్ని మనమే చేపడదాం.. అంటూ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. మరణిస్తే బొంద పెట్టేందుకు 6 అడుగుల జాగా కూడా దొరకని పరిస్థితి మన రాష్ట్రంలో ఉందని అన్నారు. దీనంతటికీ కారణం దొరల పాలనే అని విమర్శలు గుప్పించారు. బుధవారం నాడు.. బీఎస్పీ ఎన్నికల శంఖారావ సభను కొత్తగూడెం పట్టణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో బీఎస్పీ శ్రేణులు భారీగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఆర్ఎస్పీ, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ప్రజలనుద్దేశించి ప్రసంగించి ఆర్ఎస్పీ.. కొత్తగూడెం గడ్డమీద మొట్టమొదటి బహుజనుల ఎన్నికల నగారా మోగిందని, అగ్ర వర్ణ పార్టీల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా భారీ ర్యాలీ నిర్వహించామన్నారు.
పూర్తిగా చదవండి..Telangana Elections: వారంతా దొంగలు.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన కామెంట్స్..
2 వేల సంవత్సరాల నుంచి ఆకలి దప్పికతో ఉన్నాం.. ఇక బహుజన సమాజం తమ సత్తా చాటే సమయం వచ్చింది.. మన అధికారాన్ని మనమే చేపడదాం.. అంటూ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. మరణిస్తే బొంద పెట్టేందుకు 6 అడుగుల జాగా కూడా దొరకని పరిస్థితి మన రాష్ట్రంలో ఉందని అన్నారు.

Translate this News:











