మెజార్టీ తగ్గితే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సవాల్ చేశారు. కోదాడ నుంచి పద్మావతి రెడ్డి, హజూర్ నగర్ నుంచి తాను పోటీ చేస్తున్నట్లు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో కోదాడ, హజూర్ నగర్ నియోజకవర్గాల విద్యార్థి, యువజన సమ్మేళన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పద్మావతి రెడ్డి, ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. తాము పోటీ చేస్తున్న రెండు నియోజకవర్గాల్లో 50 శాతం కంటే అదిక మెజార్టీతో విజయం సాధిస్తామన్నారు. 50 శాతం కంటే మెజార్టీ తగ్గితే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఛాలెంజ్ చేశారు.
పూర్తిగా చదవండి..అలా జరుగకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా..! ఎంపీ సంచలన వ్యాఖ్యలు..
ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము పోటీ చేస్తున్న స్థానాల్లో 50 శాతం మెజార్టీ తగ్గితే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12కు 12 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Translate this News:











