ఇజ్రాయెల్ హమాస్ మిలిటెంట్ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో ఇప్పటికే వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. ఈ భీకర వాతావరణంలో ముఖ్యంగా పాలస్తీనా ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. అయితే తాజాగా భారత్ పాలస్తీనా ప్రజలకు మానవతా సాయంలో భాగంగా పలు వస్తువులు, ఔషధాలు పంపించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై 5 వేల రాకెట్లతో మెరుపు దాడి చేసింది. అయితే ఈ దాడి వెనుక ఇరాన్ ప్రమేయం ఉందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే తాజాగా అమెరికా సెనెటర్ లిండ్సే గ్రాహం కూడా ఇలాంటి ఆరోపణలే చేశారు. ఈ యుద్ధం మరింత తీవ్రతరం అయితే.. కచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఇరాన్‌ను హెచ్చరించారు. టెల్ అవీవ్ పర్యటనలో భాగంగా ఆయన ఇలా స్పందించారు.
పూర్తిగా చదవండి..Isreal-Hamas: యుద్ధం తీవ్రతరమైతే అది మీ దాకా వస్తుంది.. ఆ దేశానికి అమెరికా హెచ్చరికలు
ఇజ్రాయెల్‌పై హమాస్ మిలిటెంట్లు జరిపిన దాడి వెనుక ఇరాన్ ప్రమేయం ఉందనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా సెనెటర్ లిండ్సే గ్రాహం ఇరాన్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఈ యుద్ధం మరింత తీవ్రతరమైతే.. కచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. చివరికి అది మీ వరకూ కూడా వస్తుందంటూ హెచ్చరించారు. ఇటీవల జరిగిన హమాస్ దాడులు ఇరాన్ సహాకారం లేకుండా జరిగాయని చెబితే అది హాస్యాస్పదమే అవుతుందని పేర్కొన్నారు.

Translate this News:











