Allu Arjun in Nalgonda: పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ నల్లగొండలో సందడి చేశాడు. తనకు పిల్లనిచ్చిన మామ కంచర్ల చంద్రేశేఖర్ రెడ్డి నిర్మించిన కంచర్ల కన్వెన్షన్ హాల్ (Kancharla Convention Place) ప్రారంభించాడు. దీంతో బన్నీని చూసేందుకు అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. జై బన్నీ నినాదాలతో ఆ ప్రాంగణంతా మార్మోగిపోయింది. మధ్యాహ్నం సమయంలో అక్కడికి వచ్చిన పుష్పరాజ్‌కి భారీ గజమాలతో ఘన స్వాగతం పలికారు. అయితే బన్నీ మామ చంద్రశేఖర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో నాగార్జున సాగర్ టికెట్ ఆశిస్తున్నారు. అందుకే తన బలం చూపించుకోవడానికే ఈ కన్వెన్షన్ హాల్ కట్టారని.. దానికి తన అల్లుడు అల్లు అర్జున్‌ని పిలిచి ఓపెన్ చేయించారనే టాక్ వినిపిస్తోంది. దాదాపు 10వేల మందికి ఇక్కడ భోజనాలు ఏర్పాటుచేశారు.
పూర్తిగా చదవండి..Allu Arjun: ప్రజలకు మంచి చేస్తున్న నా మామను అభినందిస్తున్నా: బన్నీ
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తనకు పిల్లనిచ్చిన మామ కోసం నల్లగొండ విచ్చేశాడు. ఉదయం నుంచే బన్నీ రాక కోసం అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. మధ్యాహ్నం సమయంలో అక్కడికి వచ్చిన పుష్పరాజ్‌కి భారీ గజమాలతో ఘన స్వాగతం పలికారు.

Translate this News:











