ఇటివలి కాలంలో ఇండియా-పాక్(India-Pak) క్రికెటర్ల స్నేహం గురించి సోషల్‌మీడియా రెండు వర్గాలుగా చీలిపోయి వాదించుకుంటోంది. పాక్ క్రికెటర్లతో టీమిండియా ఆటగాళ్లు అతిగా కలిసి స్నేహం చేస్తున్నారని కొంతమంది వాదిస్తుండగా.. మరికొంతమంది మాత్రం క్రికెటర్ల మధ్య ఫ్రెండ్షిప్ని తప్పుపట్టడానికి లేదని అంటున్నారు. ముఖ్యంగా కోహ్లీ చుట్టూనే ఈ గొడవ అంతా సాగుతోంది. కోహ్లీ(Virat Kohli)కి పాక్ క్రికెట్ టీమ్ నుంచి వచ్చే గౌరవం చాలా ఎక్కువ. కోహ్లీకి పాక్‌లోనూ అభిమానులు ఎక్కువే. పాక్ క్రికెటర్లు సైతం కోహ్లీ గురించి గొప్పగా చెప్పడానికి ఏ మాత్రం బ్యాక్ స్టెప్ వేయరు. కోహ్లీ ఆట అలాంటిది మరి. కోహ్లీ, పాక్ క్రికెటర్లు కలిసి ఉన్న ఫొటోలు, వీడియోలు బయటకు వచ్చిన ప్రతిసారి ఏదో అభిమానులు పరస్పరం ఆర్గ్యూ చేసుకోవడం మాములే. ఇక ప్రపంచ కప్ ఆడేందుకు పాక్ జట్టు ఇండియాకు వచ్చింది. పాక్ టీమ్‌ని కోహ్లీని పార్టీకి పిలిచాడంటూ ఓ వార్త చక్కర్లు కొడుతోంది.
పూర్తిగా చదవండి..Fact Check: పాకిస్థాన్ క్రికెటర్లను పార్టీకి పిలిచిన కోహ్లీ.. సోషల్‌మీడియాలో రచ్చ..!
పాకిస్థాన్ క్రికెటర్లకు పార్టీ ఇస్తున్నానంటూ విరాట్ కోహ్లీ పేరిట ఓ ఫేక్ అకౌంట్ నుంచి ట్వీట్ పబ్లిష్ అయ్యింది. ఇది కాస్త నిమిషాల్లో వైరల్‌గా మారింది. కొంతమంది తెలియక ఆ ట్వీట్‌ని షేర్ చేసేశారు. విరాట్ కోహ్లీ తీరును తప్పుపడుతూ సోషల్‌మీడియాలో మరికొందరు విమర్శలు గుప్పించగా.. ఆ ట్వీట్‌ని క్రాస్ చెక్ చేస్తే అది ఫేక్ అని తేలింది.

Translate this News:











