వరల్డ్కప్ హోస్ట్ చేస్తున్నామంటే ఎంతో హూందాగా అనిపించాలి. అందులో మనది క్రికెట్ పిచ్చి దేశం. పైగా మన క్రికెట్ బోర్డు ప్రపంచంలో ధనిక బోర్డు. బీసీసీఐ దగ్గర ఉన్న డబ్బులు ఐసీసీ(ICC) దగ్గర కూడా లేవు. ప్రపంచంలో దాదాపు అన్ని క్రికెట్ బోర్డును శాసిస్తున్న సత్తా మనది. అయితే బీసీసీఐ నిర్లక్ష్యం ఇండియా ప్రతిష్టను అభాసుపాలు చేస్తోంది. మొన్న వరల్డ్ హయ్యస్ట్ సీటింగ్ కెపాసిటీ ఉన్న ఆహ్మదాబాద్ క్రికెట్ స్టేడియంలో కూర్చిలపై కాకి రెట్లను చూసి విస్తూపోయిన అభిమానులు ఇప్పుడు హైదరాబాద్ క్రికెట్ స్టేడియంలోని సీట్లను చూసి నోరెళ్లబెట్టాల్సి వస్తోంది. ఎందుకంటే మన స్టేడియంలోనూ అదే పరిస్థితి చాలా సీట్లలో పక్షల రెట్టలు దర్శనమిస్తున్నాయి. ఇది ఫొటోలు తీసిన ఓ క్రికెట్ ఫ్యాన్ సోషల్మీడియాలో పోస్ట్ చేయగా.. అది కాస్త వైరల్గా మారింది.
పూర్తిగా చదవండి..World cup 2023: హైదరాబాద్ స్టేడియం సీట్లలో పక్షుల రెట్టలు.. 2 వేలు ఖర్చు పెట్టి వీటిపై కూర్చోవాలా?
బీసీసీఐపై ఫ్యాన్స్ తిట్ల వర్షం కురిపిస్తున్నారు. వరల్డ్ కప్ హోస్ట్ చేస్తున్న బీసీసీఐ స్టేడియాల నిర్వహణలో మాత్రం ఫెయిల్ అవుతుందని విమర్శిస్తున్నారు. ఆహ్మదాబాద్, హైదరాబాద్ క్రికెట్ స్టేడియంలోని కూర్చిలపై పక్షుల రెట్టలు ఉండటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇలా చేస్తే మిగిలిన దేశాల ముందు మన దేశం పరువు పోతుందని వాపోతున్నారు.

Translate this News:











