అసలు పాకిస్థాన్‌కు ఇండియాలో మ్యాచ్‌లు ఆడడమే ఇష్టం లేదు. ఎందుకంటే ఇండియా పాకిస్థాన్‌కు వెళ్లడం లేదు. సో మేము కూడా ఇండియాకు వచ్చేదే లేదు అని పాక్ బోర్డు చాలా సార్లు తెగేసి చెప్పింది. అయినా చివరిలో చేసేదేం లేక ఇండియా ఫ్లైట్ ఎక్కింది. హైదరాబాద్‌లో ల్యాండ్ అయ్యింది. వరల్డ్‌కప్‌లో పాక్ ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడింది.. అందులో రెండు గెలిచింది. అయినే కొన్ని విషయాల్లో ఇండియా పట్ల పాక్ అసహనంతో ఉంది. ఇండియాలో మ్యాచ్‌లను కవర్ చేసేందుకు పాకిస్తాన్ జర్నలిస్టులకు ఇప్పటివరకు లైన్ క్లియర్ కాలేదు. దీనిపట్ల పాకిస్థాన్ తీవ్ర అసంతృప్తితో ఉంది. పాక్ జర్నలిస్టులకు వీసాల జాప్యం, ప్రపంచ కప్ కోసం తమ అభిమానులకు వీసా విధానం లేకపోవడంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఐసీసీకి మరోసారి కంప్లైంట్ చేసింది. దీంతో పాటుగా అహ్మదాబాద్ అభిమానులపైనే ఫిర్యాదు చేసింది.
పూర్తిగా చదవండి..World Cup 2023: గుజరాత్ ఫ్యాన్స్‌పై పాక్ వార్.. ఐసీసీకి ఇచ్చిన కంప్లైంట్లో ఏం ఉందంటే?
పాకిస్థాన్ జర్నలిస్టులకు వీసాల జాప్యంపై ఆ దేశ బోర్డు మండిపడుతోంది. ప్రపంచ కప్ కోసం పాకిస్తాన్ అభిమానులకు వీసా విధానం లేకపోవడంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) ఐసిసికి మరోసారి కంప్లైంట్ ఇచ్చింది. ఇక అక్టోబరు 14న జరిగిన ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్ సందర్భంగా టీమ్ కెప్టెన్ బాబర్ అజామ్ లక్ష్యంగా క్రౌడ్ చేసిన అనుచిత ప్రవర్తనను సీరియస్‌గా తీసుకున్న పీసీబీ ఐసీసీకి ఫిర్యాదు చేసింది.

Translate this News:











