వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్ జట్టు పరిస్థితి గందరగోళంగా కనిపిస్తోంది. గెలిచినప్పుడు ఒకలా.. ఓడిపోయినప్పుడు మరోలా ఉంటుంది. ఈ వరల్డ్‌కప్‌లో తొలి రెండు మ్యాచ్‌లను పాక్ గెలుచుకుంది. తర్వాత అహ్మదాబాద్ వేదికగా ఇండియాపై జరిగిన పోరులో ఓడిపోయింది. భారత్‌పై ఓటమి తర్వాత ఆ జట్టు కెప్టెన్ బాబర్ అజామ్‌పై మాజీలు మండిపడ్డారు. బాబర్ కెప్టెన్సీ ఏం బాగోలేదని విమర్శించారు. అసలు ఒక స్ట్రాటజీ లేకుండా బరిలోకి దిగుతున్నారంటూ ఫైర్ అయ్యారు. ఇక ఇండియాపై ఓటమి తర్వాత ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ పాక్ ఓడిపోయింది. అంటే హ్యాట్రిక్ ఓటములు అన్నామాట. ఇది ఆ జట్టు ఫ్యాన్స్‌ను తెగ బాధపెడుతుండగా.. మాజీలకు మాత్రం కోపం తెప్పిస్తోంది.
పూర్తిగా చదవండి..World Cup: ‘కెప్టెన్సీ అంటే పూలపానుపు కాదు..’ చేతకాకపోతే తప్పుకో..!
జాతీయ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడం అంటే పూల పానుపు కాదని.. ఒత్తిడిని తట్టుకుంటూ జట్టును మందుండి నడిపించాలంటున్నాడు పాక్ లెజెండరీ ప్లేయర్ షాహీద్ అఫ్రిది. అఫ్ఘాన్ చేతిలో పాక్ ఓటమికి కెప్టెన్ బాబర్ అజామ్‌ని బాధ్యుడిని చేస్తూ ఆ జట్టు మాజీ ప్లేయర్లు మండిపడుతున్నారు. బాబర్ అజామ్‌ని కెప్టెన్సీ నుంచి తప్పించాలన్న డిమాండ్ కూడా మరోవైపు నుంచి గట్టిగా వినిపిస్తోంది.

Translate this News:












