ప్రపంచకప్‌లో మరో పెను సంచలనం నమోదైంది. అఫ్ఘానిస్థాన్(Afghanistan) చేతిలో పాకిస్థాన్(Pakistan) ఓడిపోయింది. ఈ ప్రపంచకప్‌లో నమోదైన మూడో సంచలనం ఇది. ఇదే అఫ్ఘాన్ చేతిలో ఇంగ్లండ్ ఓడిపోగా.. నెదర్లాండ్స్ చేతిలో దక్షిణాఫ్రికా పరాజయం పాలైన విషయం తెలిసిందే. తాజాగా దాయాది పాకిస్థాన్‌కు మట్టికరిపించింది అఫ్ఘాన్. ఏకంగా 8 వికెట్ల తేడాతో గెలిచింది.
పూర్తిగా చదవండి..PAK vs AFG: చెన్నై బీచ్‌లో కొట్టుకుపోయిన పాకిస్థాన్ పరువు.. ఘోరంగా పసికూనల చేతిలో..!
ప్రపంచకప్‌లో పాకిస్థాన్ జట్టుకు ఘోర అవమానం ఇది. పసికూన అఫ్ఘాన్ చేతిలో పాకిస్థాన్ ఓడిపోయింది. ఈ ఏడాది ప్రపంచకప్ సంచలనాలకు అడ్డాగా మారింది. ఈ వరల్డ్‌కప్‌లో ఇది మూడో పెను సంచలనం. పాక్ సెట్ చేసిన 283 పరుగుల టార్గెట్‌ని అఫ్ఘాన్ ఈజీగా ఛేజ్ చేసింది. అఫ్ఘాన్ 49 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 286 రన్స్ చేసింది.

Translate this News:











