పాకిస్థాన్(Pakistan) ప్లేయర్లకు ఒళ్లు వంగడంలేదు. ఫీల్డింగ్ విషయంలో పాకిస్థాన్ ప్లేయర్లపై జరిగే ట్రోలింగ్ ప్రపంచంలో మరే ఇతర జట్టుపైనా జరగదు. ఇది అనధిగా ఆ జట్టు పాటిస్తున్న సంప్రదాయం. స్లాపీ ఫీల్డింగ్‌లో పాక్ జట్టు పీహెచ్డీ చేసింది. దశాబ్దాలుగా అదే డాక్టరేట్ పట్టా పట్టుకోని గ్రౌండ్లోకి దిగుతోంది. అఫ్ఘాన్‌పై మ్యాచ్‌లోనూ అదే చేసింది. దారుణ ఫీల్డింగ్ ఆ జట్టు ఓటమికి ప్రధాన కారణం. అసలు బాల్ ఇలా కూడా ఆపుతారా.. డైవ్ ఇలా కూడా చేస్తారా అనిపించేలా ఉంటుంది పాక్ ఫీల్డింగ్. పసికూన అఫ్ఘాన్‌పై పాక్ ఓడిపోవడంతో ఆ జట్టు ఫ్యాన్స్ తల ఎత్తుకోలేకపోతున్నారు. నిత్యం సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే పాక్ క్రికెట్ సపోర్టర్స్లో చాలా మంది అఫ్ఘాన్‌పై ఓటమి తర్వాత అకౌంట్లు డియాక్టివేట్ చేసుకున్నారని సమాచారం. మరోవైపు పాక్ మాజీ ప్లేయర్లు మరింత అవమానంగా ఫీల్ అవుతున్నారు.
పూర్తిగా చదవండి..World cup 2023: ఆడడానికి వచ్చారా.. మెక్కడానికి వచ్చారా? ఏకంగా 8 కేజీల మటన్ తింటారా?
అఫ్ఘాన్‌పై ఓటమిని తట్టుకోలేకపోతున్నారు పాక్ మాజీ ఆటగాళ్లు. తమ జట్టు ప్లేయర్ల ఫిట్నెస్ ఏ మాత్రం బాలేదని పాకిస్థాన్ లెజెండరీ ప్లేయర్ వసీం అక్రమ్ విమర్శించాడు. పాక్ ఆటగాళ్ల ఫీల్డింగ్ స్కిల్స్ చూస్తుంటే రోజుకు 8 కేజీల మటన్ తింటున్నట్టు ఉందంటూ కామెంట్స్ చేశారు. వారి ఫిట్నెస్ లెవల్స్ చాలా దారుణంగా ఉన్నాయంటూ కామెంట్స్ చేశారు. అసలు ఫిట్నెస్ టెస్ట్ ఎందుకు జరపడంలేదో తనకు అర్థంకావడం లేదన్నాడు వసీం.

Translate this News:











