హిందూ ధర్మంపై గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి టాక్ ఆఫ్ ది కంట్రీగా మారిన తమిళనాడు సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి మరోసారి వార్తల్లో నిలిచారు. నిన్న గుజరాత్‌లోని అహ్మదాబాద్ వేదికగా ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో పాకిస్థాన్ని మట్టికరిపించింది. ఇక ఈ మ్యాచ్‌కు సంబంధించి సోషల్‌మీడియాలో అనేక వీడియోలు వైరల్ అవ్వగా.. వాటిలో ఓ వీడియోసై ఉదయనిధి స్టాలిన్ స్పందించారు. పాక్ ఆటగాడు మహ్మద్ రిజ్వాన్(Rizwan)ను టార్గెట్ చేసేలా స్టేడియంలోని అభిమానులు చేసిన నినాదాలపై ఉదయనిధి స్టాలిన్(Udayanidhi stalin) విమర్శించారు. ప్రస్తుతం ఆయన తమిళనాడు క్రీడా మంత్రిగా ఉన్నారు.
పూర్తిగా చదవండి..IND vs PAK: స్టేడియంలో ‘జై శ్రీ రామ్’ నినాదాలు.. గుజరాత్ క్రికెట్ ఫ్యాన్స్‌పై ఉదయనిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు!
వరల్డ్‌కప్‌లో భాగంగా పాక్‌పై మ్యాచ్‌లో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టిన విషయం తెలిసిందే. ఇక పాకిస్థాన్ వికెట్ కీపర్-బ్యాటర్ రిజ్వాన్ అవుటైన తర్వాత భారత్ ప్రేక్షకులు 'జై శ్రీ రామ్' అని చేసిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవ్వగా దీనిపై తమిళనాడు మంత్రి, సీఎం స్టాలిన్ కుమారుడు స్టాలిన్ ఘాటుగా స్పందించారు. మోదీ స్టేడియంలో పాక్ ఆటగాళ్ల పట్ల అక్కడి ప్రేక్షకుల తీరు ఆమోదయోగ్యం కాదని విమర్శించారు.

Translate this News:











