రేపు(అక్టోబర్ 29) ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ మ్యాచ్ జరగనుంది. లక్నో(Lucknow) వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో భారత్ తుది జట్టు ఎంపిక ఎలా ఉంటుందన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ఈ మ్యాచ్‌లో కూడా భారత్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా(Hardik Pandya) ఆడడం లేదు. నిజానికి న్యూజిలాండ్‌పై మ్యాచ్‌లోనూ పాండ్యా ఆడలేదు. ఆ మ్యాచ్‌కు భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. బౌలింగ్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ స్థానంలో షమీని, పాండ్యా స్థానంలో సూర్యకుమార్ యాదవ్‌ని ఆడించారు. షమీ ఐదు వికెట్లతో సత్తా చాటాడు. ఇటు సూర్యకుమార్ యాదవ్‌ని మాత్రం బ్యాడ్ లక్ వెంటాడింది. కోహ్లీ తప్పిదం వల్ల సూర్య రనౌట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది. ఇక రేపటి మ్యాచ్‌లో కూడా టీమిండియా మార్పులు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
పూర్తిగా చదవండి..IND vs ENG: ఇంగ్లండ్‌ను ముప్పుతిప్పలు పెట్టేందుకు రెడీ అయిన మ్యాచ్ విన్నర్… పాపం బట్లర్!
లక్నో వేదికగా ఇంగ్లండ్‌పై రేపు(అక్టోబర్ 29) జరగనున్న మ్యాచ్‌లో టీమిండియా అశ్విన్‌ని ఆడించాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే లక్నో పిచ్ స్పిన్‌కు అనుకూలిస్తుంది. జడేజా, కులదీప్‌తో పాటు అశ్విన్ కూడా జట్టులో ఉంటే స్పిన్ ఆడడంలో వీక్ అయిన ఇంగ్లండ్ బ్యాటర్లను ఈజీగా బోల్తా కొట్టించవచ్చని రోహిత్ ఆలోచిస్తున్నట్లుగా సమాచారం.

Translate this News:












