వరల్డ్‌కప్(World cup)లో టీమిండియా దూసుకుపోతుంది. ఇప్పటికే మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన రోహిత్(Rohit) సేన మరో విక్టరీకి రెడీ అవుతోంది. బంగ్లాదేశ్‌తో జరగనున్న పోరులో భారత్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. ఈ మ్యాచ్‌లో ఎవరూ గెలుస్తారన్నదాని కంటే ఎవరు ఏ రికార్డు బ్రేక్ చేస్తారన్నదానిపైనే ఫ్యాన్స్ ఎక్కువగా చర్చించుకుంటున్నారు. ఈ టోర్నీలో ఇప్పటికే హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. అటు కోహ్లీ కూడా మంచి టచ్‌లో కనిపిస్తున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లోనూ ఈ ఇద్దరితో పాటు యువ ఓపెనర్ శుభమన్‌గిల్ సత్తా చాటేందుకు రెడీ అయ్యాడు. గిల్ మరో అరుదైన రికార్డుకు దగ్గరలో ఉన్నాడు. దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం హషీమ్ అమ్లా(Hashim amla) రికార్డుపైనే కన్నేశాడు.
పూర్తిగా చదవండి..IND vs BAN: ఆ సింహం రికార్డు బద్దలు కొట్టేందుకు బరిలోకి దూకుతున్న పులి.. ఇక బంగ్లాకు బ్యాండ్ బాజే..!
టీమిండియా యువ సంచలనం శుభమన్ గిల్ మరో రికార్డుకు అతి దగ్గరలో ఉన్నాడు. మరో 67 రన్స్ చేస్తే దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం హషీమ్ అమ్లా రికార్డు బ్రేక్ అవుతుంది. గిల్ వన్డేల్లో 2 వేల రన్స్ మార్క్‌ను చేరుకోనున్నాడు. 36 ఇన్నింగ్స్‌లో గిల్ 1933 రన్స్ చేశాడు. అమ్లా 40 ఇన్నింగ్స్‌లో 2వేల రన్స్ చేశాడు.

Translate this News:













