విరాట్ కోహ్లీ(Virat Kohli).. ఓడిపోయే మ్యాచ్‌లను గెలిపించడం అతడికి సాధ్యమైనంతగా ప్రస్తుత జనరేషన్ ప్లేయర్లలో ఎవరికి సాధ్యం కాదు. ఛేజింగ్‌లో కోహ్లీని మించిన బ్యాటర్ ఇప్పుడు లేడు. కనీసం దరిదాపుల్లో కూడా లేరు. ఈ వరల్డ్‌కప్(World Cup) ఫస్ట్ మ్యాచ్‌లో కోహ్లీ విలువేంటో జట్టుతో పాటు ఫ్యాన్స్‌కి మరోసారి తెలిసివచ్చింది. ఆస్ట్రేలియాపై చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ ఆడిన తీరు అద్భుతం. 200 పరుగుల ఛేజింగ్‌లో ఏకంగా ముగ్గురు బ్యాటర్లు డకౌట్ అవ్వగా.. రాహుల్‌తో కలిసి కోహ్లీ జట్టును గెలిపించాడు. ఆ మ్యాచ్‌లో 85 పరుగులు చేసి కోహ్లీ అందరి నుంచి ప్రశంసలు అందుకున్నాడు. అయితే గత రెండు మ్యాచ్‌లుగా కోహ్లీ ఆటతీరు చాలా మందికి నచ్చడం లేదని తెలుస్తోంది. కేవలం సెంచరీ కోసమే ఆడుతున్నాడన్న భావన వచ్చేలా కోహ్లీ బ్యాటింగ్ సాగుతోంది. టీమిండియా టెస్ట్ స్పెషలిస్ట్ పుజారా ఇప్పటికే ఈ విషయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పాడు. అటు ఫ్యాన్స్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
పూర్తిగా చదవండి..Virat Kohli: ‘విరాట్.. ఇంత స్వార్థం పనికిరాదు..’ ట్విట్టర్లో ఏకిపారేస్తున్న నెటిజన్లు!
న్యూజిలాండ్‌పై జరిగిన వరల్డ్‌కప్ మ్యాచ్‌లో కోహ్లీ ఆటతీరును పలువురు క్రికెట్ ఫ్యాన్స్ తప్పుపడుతున్నారు. సూర్యకుమార్ యాదవ్ రనౌట్ విషయంలో కోహ్లీకి వ్యతిరేకంగా వరుస ట్వీట్లు పెడుతున్నారు. అటు సెంచరీ కోసమే కోహ్లీ ఆడుతున్నాడంటూ గత రెండు మ్యాచ్‌లుగా అతనిపై విమర్శలు పెరుగుతున్నాయి. జట్టు గెలుస్తుందని తెలిసినప్పటికీ సెంచరీ కాలేదన్న బాధతో కోహ్లీ గట్టిగా అరుస్తూ గ్రౌండ్‌ని వీడడాన్ని ప్రశ్నిస్తూ ట్వీట్లు చేస్తున్నారు.

Translate this News:











