టీమిండియాలో చోటు దక్కించుకోవడమే కష్టం.. పోటి అంత ఎక్కువగా ఉంటుంది. ఏ గవర్నమెంట్ ఎగ్జామ్‌కి కూడా అంత పోటి ఉండదు. 140 కోట్ల జనాభా ఉన్న భారత్‌లో క్రికెట్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించేది కేవలం 11 మందే. ప్రస్తుత 2023 ప్రపంచకప్‌లో టీమిండియా దూసుకుపోతోంది. జట్టులో 15మంది సభ్యులు ఉండగా.. అందులో ఏ ఒక్కరూ తక్కువ కాదు. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఈ వరల్డ్‌కప్‌లో షమి ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఇవాళే(అక్టోబర్ 22) న్యూజిలాండ్‌పై మ్యాచ్‌లో బరిలోకి దిగాడు. బంగ్లాదేశ్‌పై మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ పాండ్యా గాయపడడంతో షమిని తుది జట్టులోకి తీసుకున్నారు. అటు శార్దూల్ ఠాకూర్‌ని పక్కన పెట్టి సూర్యను తీసుకున్నారు. రోహిత్ తీసుకున్న ఈ నిర్ణయం ఎంత సరైనదో ఫ్యాన్స్ కి తెలియడానికి ఎక్కువ సమయం పట్టలేదు. న్యూజిలాండ్‌పై మ్యాచ్‌లో షమి దుమ్మురేపాడు.
పూర్తిగా చదవండి..World Cup 2023: నాలుగు మ్యాచ్‌లు పక్కన పెట్టారు.. కసితీరా బౌలింగ్ చేసి అందరి నోళ్లు మూయించాడు!
వరల్డ్‌కప్‌లో భాగంగా న్యూజిలాండ్‌పై జరిగిన పోరులో టీమిండియా స్పీడ్ స్టార్ మొహమ్మద్ షమీ అదరగొట్టాడు. 5 వికెట్లతో సత్తా చాటాడు. వన్డేల్లో ఎక్కువ సార్లు 5 వికెట్లు తీసిన భారత్ బౌలర్లలో ఒకడిగా నిలిచాడు. వన్డేల్లో షమీ ఇప్పటివరకు మూడు సార్లు 5 వికెట్లు తీశాడు. ప్రపంచకప్‌లో భారత్ తరఫున అత్యధిక సార్లు నాలుగు వికెట్లు తీసిన ప్లేయర్లలో షమీనే టాప్. షమి 5సార్లు నాలుగు వికెట్లు పడగొట్టాడు.

Translate this News:











