India vs England: సచిన్(Sachin Tendulkar) రికార్డులకు తిరుగే లేదని అంతా భావిస్తున్న సమయంలో క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చిన విరాట్ కోహ్లీ(Virat Kohli) తక్కువ కాలంలోనే మాస్టర్ రికార్డులను బ్రేక్ చేశాడు. మరికొన్ని రికార్డులను బ్రేక్ చేసేందుకు రెడీగా ఉన్నాడు. వన్డేల్లో సచిన్ సాధించిన 49 సెంచరీల రికార్డును సమం చేయడానికి కోహ్లీ అడుగుదూరంలో ఉన్నాడు. ఇంగ్లండ్‌పై మ్యాచ్‌లో కోహ్లీ ఈ రికార్డును ఈక్వెల్ చేస్తాడని అంతా భావించగా.. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ విరాట్ డకౌట్ అయ్యాడు. నిజానికి ఏ ప్లేయర్ కూడా ప్రతీ మ్యాచ్‌లోనూ అద్భుతంగా ఆడలేదు. ఈ వరల్డ్‌కప్‌లో విరాట్ టీమిండియాను పలు మ్యాచ్‌ల్లో గెలిపించాడు. ఆస్ట్రేలియాపై వరుసగా మూడు వికెట్లు కోల్పోయి టీమిండియా కష్టాల్లో ఉన్న సమయంలో అన్నీ తానై రాహుల్‌తో కలిసి జట్టుకు విక్టరీని అందించాడు. తర్వాతి మ్యాచ్‌ల్లోనూ అదే జోరును కొనసాగించిన కోహ్లీ ఇంగ్లండ్‌పై మాత్రం ఖాతా తెరవకుండానే ఔట్ అయ్యాడు. ఈ మ్యాచ్‌లో డకౌటైన కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు వచ్చి చేరింది.
పూర్తిగా చదవండి..Virat Kohli: రికార్డుల రారాజు కోహ్లీ ఖాతాలో ఊహించని రికార్డు.. బాధపడుతున్న ఫ్యాన్స్!
టీమిండియా బ్యాటింగ్ కింగ్ విరాట్ కోహ్లీ ఖాతాలో అన్వాన్టెడ్ రికార్డు వచ్చి చేరింది. ఇంగ్లండ్‌పై మ్యాచ్‌లో కోహ్లీ డకౌటైన విషయం తెలిసిందే. ఇదే కోహ్లీకి 34వ డకౌట్. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ కూడా అంతర్జాతీయ క్రికెట్లో 34సార్లు డకౌట్ అయ్యాడు. బ్యాటర్ల పరంగా చూస్తే ఈ ఇద్దరే ఇండియా నుంచి ఎక్కువసార్లు డకౌట్ అయిన ప్లేయర్లు.

Translate this News:











