వరల్డ్‌కప్‌లో ఐదు మ్యాచ్‌లో దుమ్మురేపిన ఇండియా ఆరో మ్యాచ్‌లో తడపడింది. లక్నో వేదికగా ఇంగ్లాండ్‌పై జరిగిన మ్యాచ్‌లో భారీ స్కోర్ సాధించలేకపోయింది. అవుట్ ఫీల్డ్ స్లోగా ఉండడంతో పరుగులు రావడం కూడా కష్టమైంది. 30 యార్డ్ సర్కిల్ బయట బాల్ కదలడమే గగనమైపోయింది. 50 ఓవర్లలో టీమిండియా 9 వికెట్లకు 229 రన్స్ చేయగలిగింది.
పూర్తిగా చదవండి..IND vs ENG: గెలుస్తారా.. బోర్లా పడుతారా? ఇంగ్లండ్ టార్గెట్ ఎంతంటే?
ఇంగ్లండ్‌పై పోరులో టీమిండియా 9 వికెట్ల నష్టానికి 229 రన్స్ చేసింది. భారత్ బ్యాటర్లలో రోహిత్ 87 పరుగులు, సూర్యకుమార్ యాదవ్ 49 రన్స్‌తో రాణించారు. ముఖ్యంగా రోహిత్ ఆట ఈ మ్యాచ్‌లో అందరిని ఆకట్టుకుంది. 100 బంతుల్లో 87 రన్స్ చేసిన రోహిత్ ఖాతాలో 10 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి.

Translate this News:











