క్రికెట్లో కొన్నిసార్లు స్పిన్నర్లు క్రియేట్ చేసే అద్భుతాలను చూడడానికి రెండు కళ్లూ చాలవు. బాల్ ఎక్కడ పిచ్ అవుతుందో..ఎటు వైపునకు తిరుగుతుందో ఊహించడం కష్టమే. దివంగత ఆస్ట్రేలియా స్పిన్నర్ షేన్ వార్న్ వేసే బంతులు చూసి ప్రపంచం ఎన్నో సార్లు నొరెళ్లబెట్టింది. ఇటు భారత్ కూడా ఎంతోమంది గొప్ప స్పిన్నర్లను ప్రపంచ క్రికెట్‌కు అందించింది. అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్, అశ్విన్ లాంటి టాప్ స్పిన్నర్లు ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెట్టారు. పాంటింగ్, క్లార్క్, స్మీత్ లాంటి ఆస్ట్రేలియా మేటి బ్యాటర్లకు చమటలు పట్టించారు. ఇదే కొవలోకి వస్తాడు టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్. ప్రస్తుత ప్రపంచకప్‌లో తన సత్తా ఏంటో ప్రపంచానికి చూపిస్తున్న కుల్దీప్ మరోసారి తన మ్యాజిక్‌ను చూపించాడు.
పూర్తిగా చదవండి..IND vs ENG: బాల్ ఆఫ్ ది వరల్డ్‌కప్.. ఏమన్నా వేశాడా భయ్యా..!
ఇంగ్లండ్‌పై మ్యాచ్‌లో కెప్టెన్ బట్లర్‌ను స్పిన్నర్ కుల్దీప్ ఔట్ చేసిన బంతిపై క్రికెట్ సర్కిల్స్‌లో తెగ చర్చ జరుగుతోంది. ఏకంగా బాల్ని 7.2 డిగ్రీలు టర్న్ చేసిన కుల్దీప్పై ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు క్రికెట్ ఎక్స్పర్ట్స్. ఇన్నింగ్స్ 16వ ఓవర్ తొలి బంతికి కుల్దీప్ బంతికి బట్లర్ బొక్క బోర్లా పడి క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

Translate this News:











