ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది. సెమీస్‌కి వస్తారని.. ఇండియాను మట్టి కరిపించి ఫైనల్‌కు వెళ్తారని పాకిస్థాన్ క్రికెట్ అభిమానులు ఏవేవో కలలు కన్నారు. మొదటి రెండు మ్యాచ్‌లు పాక్ దుమ్మురేపింది. దీంతో వారి కలలు ఫైనల్‌కు వెళ్లడం నుంచి కప్ కొట్టడం.. బాబర్ అజామ్ ఆ కప్‌ను ముద్దుపెట్టుకోవడం వరకు వెళ్లాయి. అక్టోబర్14 వరకు అలానే ఉన్న వారి డ్రీమ్స్‌పై టీమిండియా నీళ్లు చల్లింది. వెంటనే ఉలిక్కిపడి లేచారు పాక్ అభిమానులు. అప్పటినుంచి పాపం నిద్రే పోలేదు.. వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది పాకిస్థాన్. దీంతో పాక్ జట్టుపై సోషల్‌మీడియాలో ఫుల్ ట్రోలింగ్ నడుస్తోంది. ఆఖరికి అంతర్జాతీయ క్రికెట్లోకి ఇప్పటివరకు ఎంట్రీ ఇవ్వని ఐస్‌ల్యాండ్ టీమ్ కూడా పాక్‌ను ట్రోల్ చేస్తుందంటే బాబర్ టీమ్ సపోర్టర్స్ బాధ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
పూర్తిగా చదవండి..World Cup 2023: చివరకు ఈ గతి పట్టింది.. పాకిస్థాన్ క్రికెట్ టీమ్‌ను ట్రోల్ చేసిన ఐస్‌ల్యాండ్!
వరుస ఓటములతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పాకిస్థాన్ క్రికెట్‌పై అన్ని వైపుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఐస్‌ల్యాండ్ క్రికెట్ అఫిషీయల్ ట్విట్టర్ హ్యాండిల్ పాక్ టీమ్‌ను ట్రోల్ చేసింది. ఇక ఆడింది చాలు అని.. తమతో వచ్చి సిరీస్ ఆడాలంటూ ఎగతాళి చేసింది. దీనికి సంబంధించిన ట్వీట్ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

Translate this News:











