బ్యాటింగ్, బౌలింగ్‌ను మాత్రమే నమ్ముకుంటే గెలిచే రోజులు కావివి. క్రికెట్ రూపురేఖలు మారిపోయి ఏళ్లు గడిచిపోయాయి. మ్యాచ్ గెలవాలంటే ఒకప్పుడు సెంచరీలు, వికెట్లు తియ్యడం కావాలి.. ఇప్పుడు ఈ రెండే ఉంటే సరిపోదు. గెలిచే మ్యాచ్‌లను తారుమారు చేసే సత్తా ఫీల్డింగ్‌కు ఉంది. అన్ని జట్లకు ఈ విషయం తెలుసు. ప్రపంచ క్రికెట్‌ను దశాబ్దాల పాటు ఏలిన ఆస్ట్రేలియాకు అందరికంటే కాస్త ఎక్కువే తెలుసు. అందుకే ఫీల్డింగ్‌ను అసలు విస్మరించదు ఆసీస్. అది వారి బలం కూడా. మరోసారి అదే ప్రూవ్ అయ్యింది. వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా ఖాతాలో మరో రెండు పాయింట్లు యాడ్ అయ్యాయి. దీనికి కారణం ఆ జట్టు ఫీల్డింగ్.
పూర్తిగా చదవండి..AUS vs NZ: ఆస్ట్రేలియా గెలవడానికి అసలు కారణం ఇదే.. ఎవరైనా అడిగితే ఈ ప్రూఫ్స్ చూపించండి!
ఆస్ట్రేలియా ఫీల్డర్ల పోరాటమే ఆ జట్టును గెలిపించింది. చివరి ఓవర్లో అద్భుతమైన ఫీల్డింగ్‌తో జట్టుకు నాలుగు పరుగులు సేవ్ చేశారు మ్యాక్స్ వెల్, లబూషెన్. కివీస్ కేవలం గెలుపునకు 5 పరుగుల దూరంలోనే నిలిచింది. ఒకవేళ ఆస్ట్రేలియా ఫీల్డర్ల విన్యాసాలే లేకుంటే మ్యాచ్ రిజల్ట్ మరోలా ఉండేది.

Translate this News:











