చాలా ఏళ్లుగా క్రికెట్ మారుతూపోతోంది. ఒకప్పుడు బౌలింగ్ డామినేషన్గా ఉన్న క్రికెట్ తర్వాత బ్యాట్ వర్సెస్ బాల్ అన్నట్లు సాగింది. టీ20ల రాకతో పాటు కొన్ని క్రికెట్ బోర్డుల డబ్బుల దాహం కారణంగా క్రికెట్ ఇప్పుడు పూర్తిగా బ్యాటింగ్ గేమ్‌గా మారిపోయింది. 2015 ప్రపంచకప్ ఆస్ట్రేలియాలో జరగగా.. పూర్తిగా డ్రాప్ ఇన్ వికెట్లపై మ్యాచ్‌లు జరిగాయి.. దాదాపు ప్రతీ మ్యాచ్‌లోనూ 300కు పైగా పరుగులు సాధించేవి జట్లు. ఇంగ్లండ్‌లో జరిగిన 2019 ప్రపంచకప్‌లో 2015 వరల్డ్‌కప్‌తో పోల్చితే కాస్త బ్యాటింగ్ ఫేవర్ పిచ్‌లు తగ్గినా.. ప్రస్తుతం ఇండియాలో జరుగుతున్న ప్రపంచకప్ పూర్తిగా బ్యాటింగ్ పిచ్‌లపై జరుగుతున్నాయి. అసలు ఆడుతుంది క్రికెట్ పిచ్‌పైనా లేదా హైవే పైనా అన్న అనుమానం కలుగుతోంది. మూడు ప్రపంచకప్లుగా ఇదే తరహా పిచ్‌లు ఉన్నా ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ మాత్రం తన సత్తా ఏంటో చూపిస్తూ వచ్చాడు. జీవలం లేని పిచ్‌లపైనే వికెట్లు తీశాడు. అలాంటి స్టార్క్‌కు ప్రస్తుతం గడ్డు రోజులు గడుస్తున్నాయి.
పూర్తిగా చదవండి..World cup 2023: పేరుకేమో తోపు, తురుము.. ఇప్పుడేమో ఆటలో అరటిపండు!
ఆస్ట్రేలియా బౌలింగ్ పెద్ద దిక్కు మిచెల్ స్టార్క్‌కు ప్రస్తుతం ఏదీ కలిసిరావడం లేదు. వరల్డ్‌కప్‌లో ఇప్పటివరకు ఆడిన ప్రతీ మ్యాచ్‌లోనూ వికెట్ తీసిన రికార్డు కలిగి ఉన్న స్టార్క్.. న్యూజిలాండ్‌పై మ్యాచ్‌లో వికెట్ తియ్యలేకపోయాడు. అంతేకాదు వరల్డ్‌కప్ చరిత్రలో ఆస్ట్రేలియా నుంచి అత్యంత చెత్త గణాంకాలను నమోదు చేశాడు. 9 ఓవర్లలో 89 పరుగులు ఇచ్చి వరస్ట్ రికార్డును మూటగట్టుకున్నాడు.

Translate this News:











