క్రికెట్ ఆడడానికి ఫిట్నెస్ అవసరమే.. లేకపోతే ఎఫెక్టీవ్ ఫీల్డింగ్ చేయలేం.. వికెట్ల మధ్య పరిగెత్తలేం.. వేగంగా బౌలింగ్ చేయలేం.. ఎక్కువగా గాయలు పాలయ్యే అవకాశం కూడ ఉంటుంది. అయితే బ్యాటింగ్‌లో సిక్సులు బాదడానికి, టన్నుల కొద్ది పరుగులు చేయడానికి, ఫీల్డింగ్ గోడలను బ్రేక్ చేస్తూ ఫోర్లు కొట్టడానికి జిమ్ ఫిట్నెస్ అవసరంలేదు. ఇది ఎవరో చెబుతున్న మాట కాదు.. క్రికెట్ ప్రేమికులను, చాలా కాలంగా ఆటను ఆస్వాదిస్తున్న వారిని అడిగితే చెబుతారు. అదికూడా విత్ ఎగ్జాంపుల్స్‌తో. టీమిండియా మాజీ ఓపెనర్ డాషింగ్ ప్లేయర్ సెహ్వాగ్ ఫిట్నెస్ అంతంతమాత్రమే..అయినా సెహ్వాగ్(Sehwag) మ్యాచ్ విన్నర్. వేగంగా స్కోర్ చేస్తూ తర్వాత దిగే బ్యాటర్లపై ఒత్తిడి తగ్గించే ప్లేయర్ అతను. టెస్టు్ల్లో రెండు సార్లు ట్రిపుల్ సెంచరీ బాదిన ప్లేయర్ సెహ్వాగ్. ఇక క్రికెట్లో లెజెండరీ బ్యాటర్లలో ఒకరైన ఇంజమామ్ ఉల్ హక్(Inzamam-ul-Haq) భారీ శరీరాన్ని కలిగి ఉంటాడు. అతని బాడీలో ఎక్కువగా ఫ్యాటే(కొవ్వు) కనిపిస్తుంది. అయినా ఇంజమామ్ లాంటి బ్యాటర్ పాక్‌కు ఇప్పటివరకు దొరకలేదు. అటు సిక్సులు కొట్టడానికి పిండిపదార్థాలు కాదు.. ప్రొటిన్ ఎక్కువగా తీసుకోవాలంటూ పాక్ ప్లేయర్ ఇమామ్ ఉల్ హక్(Imam ul Haq) పెట్టిన ట్వీట్‌కు ఓ నెటిజన్ ఇచ్చిన రీట్వీట్ రిప్లై నెట్టింట్లో వైరల్‌గా మారింది.
పూర్తిగా చదవండి..World Cup: భారీ శరీరంతో మీ మామయ్య ప్రత్యర్థులను ఉతికి ఆరేశాడు.. మీకేమో తిండిగోలా..ఉఫ్!
ఈ వరల్డ్‌కప్‌లో పాక్ జట్టు ఆట మ్యాచ్ మ్యాచ్‌కు మరింత తీసికట్టుగా మారుతోంది. పసికూన అఫ్ఘాన్‌పై మ్యాచ్‌లోనూ పాక్ ఓడిపోయింది. ఇదే సమయంలో పాక్ ఓపెనర్ ఇమామ్ ఇచ్చిన స్టేట్మెంట్పై నెట్టింట్లో సెటైర్లు పేలుతున్నాయి. సిక్సులు కొట్టడానికి మరింత ప్రొటీన్ అవసరం అని.. పిండిపదార్థాలు కాదంటూ వ్యాఖ్యలు చేశాడు ఇమామ్. అయితే అతనికి క్రికెట్ ఫ్యాన్స్ ఎలా కౌంటర్లు వేశారో ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.

Translate this News:











