టీమిండియా అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పాడు రోహిత్ శర్మ(Rohit sharma). రేపు(అక్టోబర్ 14) పాక్(Pakistan)తో జరిగే పోరుకు యువ సంచలనం శుభమన్‌గిల్ ఆడనున్నాడట. 99శాతం గిల్(Gill) రేపటి మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడని రోహిత్ చెప్పడంలో ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. గత శుక్రవారం గిల్‌కి డెంగీ పాజిటివ్‌గా తేలింది. అప్పటి నుంచి మూడు రోజుల పాటు చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నాడు గిల్. ప్లేట్లెట్ కౌంట్ కూడా పడిపోయిందని వైద్యులు చెప్పారు. ఇక మంగళవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన గిల్ తర్వాత జట్టుతో పాటు ఢిల్లీ వెళ్లలేదు. మంగళవారం అఫ్ఘాన్‌తో ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌కు అందుబాటులో లేడు గిల్.
పూర్తిగా చదవండి..IND vs PAK: ఈ టీమిండియా తురుపు ముక్క ఆడడం ఫిక్స్ తమ్ముడు..! పాకిస్థాన్‌కు ఇక దబిడి దిబిడే..!
టీమిండియా ఫ్యాన్స్‌కు శుభవార్త ఇది. వరల్డ్‌కప్‌లో భాగంగా రేపు(అక్టోబర్ 14) పాకిస్థాన్‌తో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్‌కు గిల్ అందుబాటులో ఉంటాడని కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు. 99శాతం గిల్ పాక్‌పై పోరులో బరిలోకి దిగుతాడని స్పష్టం చేశాడు. గత శుక్రవారం శుభమన్‌గిల్‌కి డెంగీ పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే.

Translate this News:











