రోహిత్ శర్మ(Rohit sharma) బ్యాట్‌తోనే సమాధానం చెబుతాడు. ఎన్ని విమర్శలు వచ్చినా నోరు విప్పాడు. రోహిత్ శర్మ బ్యాట్‌తో చెప్పే సమాధానం కూడా ఏదో సాధారణంగా ఉండదు. రికార్డులు, సిక్సర్లతోనే అందరీ నోళ్లు మూయిస్తాడు. ప్రపంచకప్‌కి ముందు రోహిత్ బ్యాటింగ్‌ని వేలు ఎత్తి చూపిన వారు చాలా మందే ఉన్నారు. అయితే ఇప్పుడు వారి నోటి నుంచి ఎలాంటి మాట వినపడడం లేదు. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో డకౌట్ అయిన రోహిత్ తర్వాత అఫ్ఘాన్‌పై జరిగిన మ్యాచ్‌లో రికార్డు సెంచరీ చేశాడు. 63 బాల్స్‌లోనే సెంచరీ చేసిన రోహిత్ వరల్డ్‌కప్‌లో భారత్ తరుఫున వేగంగా 100 పరుగులు చేసిన ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. ఇక సిక్సర్ల విషయంలోనూ గేల్ రికార్డు గత మ్యాచ్‌లోనే బద్దలైంది. అయితే అఫ్ఘాన్‌పై కొట్టడం కాదు పాకిస్థాన్(Pakistan)పై కొట్టాలంటూ కొంతమంది కామెంట్స్ చేశారు. వారందరికి గట్టిగా ఇచ్చిపడేశాడు రోహిత్
పూర్తిగా చదవండి..Rohit Sharma: రికార్డుల ఊచకోత.. వారికి గట్టిగా ఇచ్చిపడేసిన హిట్‌మ్యాన్..!
రోహిత్ శర్మ సిక్సర్ల ఊచకోత కొనసాగుతోంది. పాక్‌పై మ్యాచ్‌లో 63 బంతుల్లోనే 86 రన్స్ చేసిన రోహిత్ ఖాతాలో కొత్త రికార్డులు వచ్చి చేరాయి. ఒకే ఇన్నింగ్స్‌లో 5 లేదా అంతకంటే ఎక్కువ సిక్సర్లు కొట్టిన జాబితాలో రోహిత్ ఫస్ట్ ఉన్నాడు. 33 సార్లు ఒకే ఇన్నింగ్స్‌లో రోహిత్ ఈ ఫీట్ సాధించాడు. ఒకే క్యాలెండర్ ఇయర్లో రోహిత్ నాలుగు సార్లు 60కు పైగా సిక్సులు కొట్టాడు.

Translate this News:











