రోహిత్ శర్మ(Rohit sharma).. విరాట్ కోహ్లీ(Virat kohli).. టీమిండియాకు రెండు కళ్లు లాంటి వారు. ఈ ఇద్దరి ఫ్యాన్స్ మధ్య ఓవైపు నిత్యం వార్ నడుస్తూనే ఉంటుంది కానీ.. ఈ ఇద్దరు మాత్రం అవేవీ పట్టించుకోరు. తమ పని చేసుకుపోతుంటారు. గ్రౌండ్లో ప్రత్యర్థు వెన్నులో వణుకు పుట్టిస్తుంటారు. ఒకరు సిక్సర్ల కింగ్ అయితే మరోకరు ఫోర్ల వీరుడు. ఇద్దరికి ఇద్దరే.. ఎవరూ తక్కువ కాదు. నిన్నటి పాక్‌పై మ్యాచ్‌లో రోహిత్ శర్మ చెలరేగి బ్యాటింగ్ చేశాడు. రోహిత్ శర్మ దెబ్బకు పాక్ బౌలర్ల వద్ద సమాధానమే లేకుండా పోయింది. ఓ మాదిరి లక్ష్యమేనైనా వరుస పెట్టి వికెట్లు తీసి ఉంటే మ్యాచ్ టూ సైడ్‌గా మారి ఉండేది. పాక్ పేసర్ల దగ్గర ఆ సత్తా ఉంది కూడా. అయితే రోహిత్ దూకుడుగా ఆడుతుంటే ఎంతటై ప్రపంచ స్థాయి బౌలర్ అయినా నెల చూపులు చూడాల్సిందే..అభిమానులు ఆకాశం వైపు చూసి ఎగరాల్సిందే. రోహిత్ సిక్సర్ల వర్షానికి పాక్ కొట్టుకుపోగా.. హిట్‌మ్యాన్ ఖాతాలో అనేక రికార్డులు వచ్చి చేరాయి. అయితే కోహ్లీ, రోహిత్‌కి ఓ విషయంలో ఒక్కటే రికార్డు కలిగి ఉన్నారు. ఫార్మాట్ వేరైనా రికార్డు మాత్రం ఒక్కటే. అదేంటో చూడండి..
పూర్తిగా చదవండి..World Cup 2023: ఇద్దరూ ఇద్దరే.. రోహిత్, కోహ్లీకి ఉన్న ఈ రికార్డులు చూస్తే మతిపోవాల్సిందే..!
వన్డే ప్రపంచ కప్‌లో సక్సెస్ఫుల్ ఛేజింగ్‌లో ఎక్కువ పరుగులు చేసిన ప్లేయర్‌గా రోహిత్ నయా రికార్డు క్రియేట్ చేశాడు. అంతేకాదు సక్సెస్ఫుల్ రన్ ఛేజింగ్‌లో ఎక్కువ సార్లు 50 లేదా అంతకంటే ఎక్కువ పరుగుల బాదిన బ్యాటర్ కూడా రోహిత్‌నే. అటు టీ20 ప్రపంచకప్‌లో సక్సెస్ఫుల్ ఛేజింగ్‌లో ఎక్కువ పరుగులు చేసిన ప్లేయర్ కోహ్లీ. టీ20 ప్రపంచకప్‌లో సక్సెస్ఫుల్ రన్ ఛేజింగ్‌లో ఎక్కువ సార్లు 50 లేదా అంతకంటే ఎక్కువ పరుగుల బాదిన బ్యాటర్ కోహ్లీ.

Translate this News:











