దోమల దెబ్బ సామాన్య ప్రజలకే కాదు.. స్టార్ క్రికెటర్లను కూడా వదలడంలేదు. ఒక చిన్న దోమ అనేక రోగాలకు కారణం.. టీమిండియా స్టార్ ఓపెనర్ శుభమన్ గిల్(Shubman gill)ని కొట్టిన దోమ మాములది కాదు.. అందుకే అతను డెంగీ(Dengue) బారిన పడ్డాడు. డెంగీ నుంచి త్వరగా కోలుకోవడం కుదరని పని.. ఎందుకంటే అది ప్లేట్లెట్లకు సంబంధించిన వ్యవహారం. గిల్ విషయంలోనూ అదే జరుగుతోంది. డెంగీ బారిన పడ్డ గిల్ ఇప్పుడప్పుడే కోలుకునే సూచనలు కనిపించడంలేదు. గత శుక్రవారం గిల్‌కి డెంగీ పాజిటివ్‌గా తేలింది. దీంతో తర్వాతి రెండు మ్యాచ్‌లకు గిల్ దూరం అయ్యే ఛాన్స్‌లు కనిపిస్తున్నాయి.
పూర్తిగా చదవండి..IND vs PAK: మాయదారి దోమ.. పాక్ మ్యాచ్‌కి టీమిండియా తురుము దూరం..! ప్చ్.. ఇలా జరిగిందేంటి?
వరల్డ్‌కప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు ముందు టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గత శుక్రవారం డెంగీ పరీక్షల్లో యువ ఓపెనర్ గిల్‌కు డెంగీ పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం చెన్నైలో చికిత్స పొందుతున్న గిల్ భారత్‌తో కలిసి ప్రయాణించడంలేదని బీసీసీఐ సెక్రటరీ జయ్షా ప్రకటించారు. అక్టోబర్ 11న అఫ్ఘానిస్థాన్‌తో మ్యాచ్‌తో పాటు అక్టోబర్ 14న పాక్‌తో మ్యాచ్‌కు గిల్ అందుబాటులో ఉండే ఛాన్స్ లేదు.

Translate this News:












