వరల్డ్‌కప్‌లో సచిన్‌ని గుర్తుచేస్తాడనుకున్న టీమిండియా యువ ఓపెనర్ గిల్(Gill)ని బ్యాడ్ లక్ వెంటాడి కుట్టింది. దోమ కాటుకు గురైన గిల్ డెంగీ(Dengue) బారిన పడ్డాడు. గత శుక్రవారం గిల్‌కు డెంగీ పాజిటివ్‌గా తేలింది. అప్పటినుంచి నాలుగు రోజుల పాటు చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న గిల్ రెండు రోజుల క్రితం డిశ్చార్జ్ అయ్యాడు. గిల్‌కి ప్లేట్లెట్ కౌంట్ పడిపోయిందని అధికారిక వర్గాలు చెప్పాయి. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత గిల్ జట్టుతో పాటు హోటల్లోనే బస చేశాడు. బీసీసీఐ వైద్య బృందం గిల్‌ని పర్యవేక్షిస్తోంది. గిల్ ఇప్పటికీ రెండు మ్యాచ్‌లకు దూరం అయ్యాడు. మంగళవారం తర్వాత గిల్ హెల్త్‌పై బీసీసీఐ ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు.
పూర్తిగా చదవండి..IND vs PAK: డెంగీని తన్ని తరిమేశాడా? గుజరాత్ గడ్డపై అడుగుపెట్టిన గిల్..! వైరల్ వీడియో..
డెంగీ బారిన పడ్డ టీమిండియా యువ ఓపెనర్ శుభమన్ గిల్ అహ్మదాబాద్‌లో అడుగుపెట్టాడు. అక్టోబర్ 14న మోదీ స్టేడియంలో పాక్‌తో ఇండియా తలపడనుంది. చెన్నై ఆస్పత్రిలో డిశ్చార్జ్ అయిన తర్వాత గిల్ జట్టుతో కలిసి ఢిల్లీకి వెళ్లలేదు. డెంగీ నుంచి గిల్ క్రమక్రమంగా కోలుకుంటున్నట్టు తెలుస్తోంది. అయితే గిల్ పూర్తిగా రీకవర్ అయ్యేవరకు గ్రౌండ్లో అడుగుపెట్టే ఛాన్స్ లేదని తెలుస్తోంది.

Translate this News:











