వరల్డ్‌కప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌పై టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత్ రన్ మెషీన్ విరాట్ కోహ్లీ సెంచరీ బాదాడు. 97 బంతుల్లో 103 రన్స్ చేసిన కోహ్లీ వన్డేల్లో 48వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో రెండు సెంచరీలు చేస్తే వన్డేల్లో 50 సెంచరీలు పూర్తి చేసిన తొలి ప్లేయర్‌గా కోహ్లీ నిలుస్తాడు. వన్డేల్లో 49 సెంచరీలతో సచిన్ టాప్‌లో ఉన్నాడు. క్రికెట్‌గాడ్ రికార్డును కోహ్లీ బ్రేక్ చేయడానికి ఎక్కువ రోజులులేవని తెలుస్తోంది. ప్రస్తుతం కోహ్లీ ఫామ్ అలా ఉంది మరి. అయితే నిన్నటి మ్యాచ్‌లో కోహ్లీ బ్యాటింగ్‌పై ఓపైవు నుంచి విమర్శలు కూడా వస్తున్నాయి. కోహ్లీ సెంచరీ కోసమే ఆడాటంటూ ట్విట్టర్లో ట్రెండ్ అవుతోంది.
పూర్తిగా చదవండి..Virat Kohli: కోహ్లీ సెంచరీకి అంపైర్ హెల్ప్ చేశాడా? విరాట్ సెల్ఫిష్ బ్యాటింగ్ చేశాడా?
బంగ్లాదేశ్‌పై జరిగిన పోరులో విరాట్ వన్డేల్లో 48వ సెంచరీ పూర్తి చేయగా.. కోహ్లీ బ్యాటింగ్ తీరుపై ట్విట్టర్లో విమర్శలు గుప్పిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. సెంచరీ కోసం సింగిల్స్ తియ్యకపోవడం.. ఓవర్ చివరి బంతిని సింగిల్ తియ్యడంపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. మరోవైపు బంగ్లాదేశ్ బౌలర్ వైడ్ వేసినా అంపైర్ వైడ్ ఇవ్వలేదని పలువురు ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

Translate this News:











