World Cup 2023 India vs Bangladesh: ఇప్పటికీ వరల్డ్‌కప్‌లో రెండు పెను సంచలనాలు నమోదయ్యాయి. ఇంగ్లండ్‌ను అఫ్ఘాన్, దక్షిణాఫ్రికాను నెదర్లాండ్స్ మట్టికరిపించాయి. మరో సంచలనం నమోదు అవుతుందా అంటే క్రికెట్లో ఏమైనా జరగొచ్చు. అందులోనూ సంచలనాలకు మారుపేరుగా నిలిచే బంగ్లాదేశ్‌తో ఆడేటప్పుడు తక్కువ అంచనా వేస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. 2007 ప్రపంచకప్(World Cup 2023)లో టీమిండియా (Team India) గ్రూప్ దశలోనే ఇంటిదారి పట్టడానికి బంగ్లాదేశే కారణం. ఇక చివరి నాలుగు మ్యాచ్‌ల్లో బంగ్లాదేశ్ (Bangladesh) ఇండియాపై మూడు సార్లు గెలిచింది. ఇప్పటికే టీమిండియాకు అనేకసార్లు షాక్ ఇచ్చిన బంగ్లాదేశ్ మరోసారి రోహిత్ సేనకు పెడుతుందో లేదో కొన్ని గంటల్లో తేలిపోనుంది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఎంచుకుంది.
పూర్తిగా చదవండి..IND vs BAN: మరో సంచలనం నమోదవుతుందా? జాగ్రత్తగా ఆడకపోతే అంతే సంగతి బాసూ!
ప్రపంచకప్‌లో భాగంగా పూణే వేదికగా టీమిండియా, బంగ్లాదేశ్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ రెగ్యూలర్ కెప్టెన్ షకీబ్ ఉల్ హసన్ ఆడడంలేదు. నజ్ముల్ హొస్సేన్ శాంటో కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఇరు టీమ్‌ల తుది జట్ల వివరాల కోసం హెడింగ్‌పై క్లిక్ చేయండి

Translate this News:











