ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో అందరికి బాగా గుర్తున్న విషయాలు రెండే రెండు.. అందులో ఒకటి చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ గెలవడం.. రెండోది విరాట్ కోహ్లీ-గంభీర్-నవీన్ ఉల్ హక్ ఎపిసోడ్. గ్రౌండ్‌లోనే తన్నుకుంటారా అని అనిపించేలా జరిగిందీ గొడవ. ఆ మ్యాచ్ తర్వాత నుంచి అఫ్ఘాన్ ఆటగాడు నవీన్ ఉల్ హక్(Naveen ul haq) కోహ్లీ(Kohli)కి పరోక్షంగా తన ఇన్‌స్టాలో కౌంటర్లు వేశాడు. ఇది కాస్త కోహ్లీ ఫ్యాన్స్‌కి మరింత కోపం తెప్పించింది. అప్పటినుంచి ఛాన్స్ దొరికినప్పుడల్లా నవీన్‌ని ఓ ఆట ఆడుకుంటున్నారు అభిమానులు. ఇక ఇండియా, అఫ్ఘాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఈ ఇద్దరూ ఎదురుపడ్డారు. నవీన్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. నవీన్‌పై కాదు కానీ కేఎల్ రాహుల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు కోహ్లీ.
పూర్తిగా చదవండి..IND vs AFG: కోహ్లీకి ఒళ్లు మండేలా చేసిన కేఎల్ రాహుల్..! నవీన్ ఉల్ హక్ విషయంలో మరోసారి రచ్చ..!
ఈ ఏడాది ఐపీఎల్లో నవీన్ఉల్ హక్ వర్సెస్ కోహ్లీ మధ్య జరిగిన గొడవ ఎంత రచ్చ లేపిందో అందరికి తెలిసిందే. తాజా వరల్డ్‌కప్‌లో భాగంగా అఫ్ఘాన్, ఇండియా మ్యాచ్‌లో కోహ్లీ ఆగ్రహానికి గురయ్యాడు. నవీన్ ఉల్ హక్‌ని అవుట్ చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కీపర్ కేఎల్ రాహుల్‌పై కోపం తెచ్చుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

Translate this News:











