బీసీసీఐకి చివాట్లు తప్పడం లేదు. మొదట వరల్డ్‌కప్ షెడ్యూల్ విషయంలోనే ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. షెడ్యూల్ కూడా వేయడం రాదా అని తిట్టారు. మిగిలిన దేశాల గగ్గొలు పెడితే కొన్ని మ్యాచ్‌లను రీషెడ్యూల్ చేశారు. కొన్ని జట్లకు ఒక మ్యాచ్‌కు మరో మ్యాచ్‌కు మధ్య గ్యాప్ తక్కువ ఉండడంతో విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత టికెట్ల విషయంలో ఫ్యాన్స్‌కి మరింత కోపం వచ్చింది. ‘బుక్‌మైషో(Book my show)’కి ఆన్లైన్లో టికెట్ విక్రయ బాధ్యతలు అప్పగించింది బీసీసీఐ. అయితే అమ్మకానికి పెట్టిన నిమిషాల వ్యవధిలోనే టికెట్లు అమ్ముడైపోయాయి. అయితే టికెట్ కొనుగోలు చేసేందుకు ఒకే సారీ ఎక్కువ మంది బుక్‌మైషో ఓపెన్ చేయడంతో సైట్ క్రాష్ అయ్యింది. ఇక వర్చువల్ వెయిటింగ్ టైమ్ అంటూ గంటల పాటు ఆన్లైన్లో వెయిట్ చేయించింది బుక్‌మైషో. తీరా గంటలు గడిచిన తర్వాత టికెట్లు సోల్డ్ అవుట్ అంటూ మెసేజ్ పెట్టింది. ఇది అభిమానులకు చిరాకు తెప్పించింది.
పూర్తిగా చదవండి..BCCI: ‘అసలు బుర్ర పనిచేస్తుందా’? ఇలా చేస్తారా? బీసీసీఐపై ఫ్యాన్స్ ఫైర్..!
అహ్మదాబాద్ స్టేడియంలో మ్యాచ్ ప్రారంభానికి ముందు జరిగిన ప్రత్యేక సంగీత వేడుకను టీవీ లైవ్‌లో ప్రసారం చేయకపోవడంపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అసలు ప్రస్తుత బీసీసీఐ అధికారులకు వరల్డ్‌కప్ నిర్వహించడం వచ్చా అని ప్రశ్నిస్తున్నారు. సంగీత కార్యక్రమంలో ముగ్గురు అత్యుత్తమ బాలీవుడ్ స్టార్స్ అరిజిత్ సింగ్, శంకర్ మహదేవన్, సుఖ్వీందర్ సింగ్ స్డేడియం గ్యాలరీల్లో కూర్చున్న అభిమానులను అలరించారు.

Translate this News:











