‘షాపింగ్ మాల్స్ పేరుతో పాకిస్థాన్ జెండాలు తయారు చేసి పెడతారా? షాపింగ్ మాల్స్ అడ్డా చేసుకుని లవ్ జిహాద్ పేరుతో హిందు యువతులను మోసం చేసే కుట్రలకు పాల్పడుతుంటే ఏం చేస్తున్నారు? అట్లాంటి షాపింగ్ మాల్స్‌కు అనుమతి ఎలా ఇచ్చారు? తక్షణమే ఆ షాపింగ్ మాల్స్‌ను మూసివేయాలి. లేకపోతే ఉరికించి ఉరికించి కొడతాం.’ అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్(Bandi sanjay kumar) ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లోని ఓ షాపింగ్ మాల్లో పాక్ జెండాలను విక్రయిస్తున్నట్లు వార్తలు రావడంతో బండి సంజయ్ కుమార్ తీవ్ర స్థాయిలో మండిపడ్దారు. ‘అట్లాంటి షాపింగ్ మాల్స్‌ను పెట్టినోళ్లకు బుద్దిలేదు. అనుమతి ఇచ్చినోళ్లకు, ప్రారంభించినోళ్లకు సిగ్గు లేదు.’ అంటూ దుయ్యబట్టారు.
భారత మాతాకీ జై… అంటూ సంబురాలు:
క్రికెట్ ప్రపంచకప్‌లో భాగంగా పాక్ భారత్ విజయ దుందుభి మోగించిడంతో కరీంనగనర్లో క్రికెట్ అభిమానులు, బీజేపీ కార్యకర్తలు టవర్ సర్కిల్లో బాణా సంచా పేల్చి సంబురాలు చేసుకున్నారు. బండి సంజయ్ కుమార్ స్వయంగా బాణాసంచా పేల్చి, మిఠాయిలు తినిపిస్తూ సంబురాల్లో పాల్గొన్నారు. తెలంగాణ అంతటా భారత మాతాకీ జై… అంటూ సంబురాలు చేసుకుంటున్నారన్నారు. కొందరు ఫాల్తుగాళ్లు అక్కడక్కడా ఉంటూ పాకిస్తాన్ గెలవాలని కోరుకుంటున్నారని ఆరోపించారు బండి సంజయ్.
IND vs PAK: షాపింగ్ మాల్స్‌లో పాకిస్థాన్ జెండాలా..? ‘ఉరికించి ఉరికించి కొడతాం’- బండి సంజయ్
దేశభక్తి కంటే కమీషన్లకే కేసీఆర్ కుటుంబం ప్రాధాన్యత ఇస్తుందని ఆరోపించారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్. షాపింగ్ మాల్స్‌లో పాకిస్థాన్ జెండాలు అమ్ముతున్నారని ఆరోపించారు. అలాంటి మాల్స్‌కు ఎలా అనుమతిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు సంజయ్. పాకిస్థాన్‌పై ఇండియా మ్యాచ్ గెలిచిన తర్వాత కరీంనగర్లో బాణాసంచా పేల్చి, మిఠాయిలు తినిపిస్తూ సంబురాల్లో పాల్గొన్న బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు

Translate this News:











