ప్రపంచకప్ చప్పగా మొదలైనా ఇప్పుడిప్పుడే కాస్త రంజుగా మారుతోంది. అఫ్ఘాన్ చేతిలో ఇంగ్లండ్ ఓటమి క్రికెట్ అభిమానుల్లో జోష్ నింపింది. అఫ్ఘానిస్తాన్‌కి మద్దతుగా చాలామంది ఢిల్లీ స్టేడియానికి పోటెత్తారు కూడా. ఇక అంతకముందు ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్‌ను క్రికెట్ ప్రపంచం టీవీలకు అతుక్కుపోయి చూసింది. అటు ప్రపంచంలోనే అతి పెద్ద సీటింగ్ కెపాసిటీ కలిగిన అహ్మదాబాద్ స్టేడియం కూడా నిండింది. ఈ మ్యాచ్‌లో ఇండియా ఏడు వికెట్ల తేడాతో విక్టరీ సాధించిన విషయం తెలిసిందే. వరల్డ్‌కప్(World cup)లో పాక్(Pakistan)పై ఇండియాకు ఇది వరుసగా 8వ గెలుపు.. ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్కసారి కూడా ఇండియాపై పాకిస్థాన్ గెలవలేదు. ఈ మ్యాచ్‌లో కూడా పాక్ ఓడిపోవడంతో అక్కడి అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇటు పాక్ మాజీ క్రికెటర్లు ప్రస్తుత టీమ్‌పై మండిపడుతున్నారు. ముఖ్యంగా కెప్టెన్ బాబర్ అజామ్(Babar Azam) టార్గెట్‌గా విమర్శలు గుప్పిస్తున్నారు..
పూర్తిగా చదవండి..World Cup 2023: నీకు దండం సామీ.. చేసింది చాలు.. ఇక తప్పుకో..!
వరల్డ్‌కప్‌లో ఇండియాపై పాకిస్థాన్ ఓడిపోవడాన్ని పాక్ జట్టు మాజీలు తట్టుకోలేకపోతున్నారు. కెప్టెన్ బాబర్ అజామ్‌పై ఒకరి తర్వాత ఒకరు విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా షోయబ్ మాలిక్ ఈ లిస్ట్‌లో చేరాడు. బాబర్ అవుట్ ఆఫ్ బాక్స్ థింక్ చేయలేడని.. కెప్టెన్‌గా తప్పుకుంటేనే మంచిదని అభిప్రాయపడ్డాడు.

Translate this News:












