‘రోహిత్ శర్మ సెంచరీల కోసం ఆడడు.. అతనో సెల్ఫ్‌లెస్ లీడర్’ అంటూ కితాబిచ్చాడు టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్. లక్నో వేదికగా ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ మ్యాచ్‌లో రోహిత్ మరోసారి జట్టును కాపాడాడు. ఓవైపు మిగిలిన భారత్ బ్యాటర్లు వరుస పెట్టి వికెట్లు కోల్పోతుంటే మరోవైపు రోహిత్ శర్మ మాత్రం ఇంగ్లండ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. గిల్, కోహ్లీ, శ్రేయర్ అయ్యార్ వికెట్లను ఆదిలోనే కోల్పోయిన టీమిండియాను రాహుల్‌తో కలిసి రక్షించాడు. మొత్తంగా 100 బంతుల్లో 87 పరుగులు చేసిన రోహిత్ సెంచరీ చేస్తాడనుకున్న సమయంలో అవుట్ అయ్యాడు.
పూర్తిగా చదవండి..Rohit Sharma: రోహిత్‌కి సెంచరీల పిచ్చి లేదు..రికార్డుల కోసం ఆడడు.. ప్రూఫ్స్ ఇవే..!
టీమిండియాలో సెంచరీలు, రికార్డుల కోసం ఆడని ప్లేయర్ రోహిత్ శర్మ అని కామెంట్స్ చేశాడు 2011 వరల్డ్‌కప్ హీరో గౌతమ్ గంభీర్. ఏ పీఆర్(PR) టీమ్ ఈ నిజాన్ని మార్చలేదన్న గంభీర్ . ఇంగ్లండ్‌పై 87 పరుగులు చేసి పెవిలియన్ చేరిన రోహిత్ ఈ ఏడాది ఇప్పటివరుకు నాలుగు సార్లు 80ల్లో ఔట్ అయ్యాడు.

Translate this News:











