వరల్డ్‌కప్(world cup)లో భాగంగా రేపు(అక్టోబర్ 21) టీమిండియా అఫ్ఘానిస్థాన్(Afghanisthan)తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియానే ఫేవరెట్ ఐనప్పటికీ అఫ్ఘాన్‌ని తక్కువ అంచనా వేస్తే బొక్క బోర్లా పడడం ఖాయం. అందుకే ఎలాంటి అలసత్వానికి అవకాశం ఇవ్వకుండా టీమిండియా జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుంది. ఇక రేపటి మ్యాచ్‌కు కూడా యువ ఓపెనర్ గిల్ అందుబాటులో ఉండడం లేదు. డెంగీ(Dengue) కారణంగా గిల్(Gill) అఫ్ఘాన్‌తో మ్యాచ్‌కు దూరం కానున్నాడు. నిన్నటివరకు చెన్నై ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న గిల్ తాజాగా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ ఐనట్టు సమాచారం. అఫ్ఘానిస్థాన్‌తో మ్యాచ్ కోసం ఢిల్లీకి వెళ్లే ముందు గిల్ ప్లేట్లెట్ కౌంట్‌ను చెక్ చేశారు. అయితే ప్లేట్లెట్ కౌంట్ చాలా తక్కువగా ఉందని అధికారిక వర్గాలు ధృవీకరించాయి.
పూర్తిగా చదవండి..Ind vs Pak: ఈ టీమిండియా మొనగాడు వస్తున్నాడు.. ఇక ప్రత్యర్థులకు చుక్కలే..!
డెంగీ బారిన పడ్డ టీమిండియా యువ సంచలనం శుభమన్ గిల్ చెన్నై ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. అయితే ప్రస్తుతం అతని ప్లేట్లెట్ కౌంట్ తక్కువగా ఉందని తెలుస్తోంది. భారత్ జట్టుతో పాటు హోటల్లోనే గిల్ ఉన్నట్టు సమాచారం. బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో గిల్ ఉన్నట్టు తెలుస్తోంది. రేపు(అక్టోబర్ 11) అప్ఘాన్‌తో మ్యాచ్‌కు గిల్ అందుబాటులో ఉండడంలేదు. అటు అక్టోబర్ 14న పాక్‌తో జరిగే మ్యాచ్‌లో గిల్ ఆడడంపైనా సందేహాలు రేకెత్తుతున్నాయి.

Translate this News:












