టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit sharma) మంచి ఊపుమీద ఉన్నాడు. అఫ్ఘాన్(Afghanistan)తో మ్యాచ్‌లో ప్రపంచ రికార్డులు తిరగరాశాడు. ఏకంగా క్రికెట్ గాడ్ సచిన్ రికార్డునే లేపేశాడు. నిజానికి వరల్డ్‌కప్(World cup)లో సచిన్(Sachin) రికార్డులు చాలా గొప్పవి. వరల్డ్‌కప్ అంటే సచిన్ పూనకాలు వచ్చినట్టు ఆడేవాడు. అయితే సచిన్ ఓ విషయంలో మాత్రం వెనకపడ్డాడు. 45 వరల్డ్‌కప్ మ్యాచ్‌ల్లో 15 హాఫ్ సెంచరీలు అయితే బాదాడు కానీ.. సెంచరీల విషయంలో మాత్రం కాస్త తక్కువ చేశాడు. వరల్డ్‌కప్‌లో సచిన్ సెంచరీల సంఖ్య ఆరు. ఇప్పటివరకు ఇదే హయ్యస్ట్ కూడా. అయితే అఫ్ఘాన్‌తో మ్యాచ్‌లో రోహిత్ సెంచరీ చేయడంతో ఆ రికార్డు చెరిగిపోయింది. ఇప్పుడు రోహిత్ ఖాతాలో ఏడు వరల్డ్‌కప్ సెంచరీలు ఉన్నాయి. అది కూడా కేవలం 19 మ్యాచ్‌ల్లోనే ఈ ఫీట్ సాధించాడు హిట్‌మ్యాన్. ఇది వరల్డ్ రికార్డు.
పూర్తిగా చదవండి..Rohit sharma: క్రికెట్ చరిత్రలో ఒకే ఒక్కడు.. ఏకంగా సచిన్ రికార్డునే లేపేసిన మొనగాడు..!
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డుల పరంపరను కొనసాగిస్తున్నాడు. అఫ్ఘాన్‌తో మ్యాచ్‌లో సెంచరీ చేసిన రోహిత్ ఖాతాలో అదిరే రికార్డులు వచ్చి చేరాయి. ప్రపంచకప్‌లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్‌గా రోహిత్ సచిన్ రికార్డును బ్రేక్ చేశాడు. ఇక అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్‌గా వెస్టిండీస్ ప్లేయర్ క్రిస్ గేల్ రికార్డును బ్రేక్ చేశాడు. ప్రపంచకప్‌లో హిస్టరీలో అత్యధిక సిక్సర్లు బాదిన టీమిండియా ప్లేయర్ కూడా రోహితే.

Translate this News:











