నాన్ వెజ్‌లో ఉండే ప్రొటిన్ పుష్కలం. ఎవరు ఔనన్నా కాదన్నా ఇది కాదనలేని నిజం. అయితే కేవలం నాన్‌వెజ్‌లోనే ప్రొటిన్ ఉంటుందనుకోవడం కరెక్ట్ కాదు. నాన్‌వెజ్‌తో సమానంగా.. కొన్ని ఆహారాలు అంతకంటే ఎక్కువగా ప్రొటిన్ని కలిగి ఉంటాయి. చాలా మంది క్రికెటర్ల డైట్లో నాన్‌వెజ్ ఉంటుంది. చికెన్, మటన్, ఫిష్‌ని ఎక్కువగా తినే క్రికెటర్లు ఉంటారు. అయితే కొంతమంది క్రికెటర్లు నాన్‌వెజ్ తినకుండా కేవలం వెజ్ మాత్రమే తింటారు. విరాట్ కోహ్లీ ప్రస్తుతం ప్యూర్ వెజ్ తింటున్నాడు. అయినా అతను ప్రపంచంలోనే ఫిట్నెస్ ఎక్కువన్న ప్లేయర్.. క్రికెట్లోనే కాదు ఇతర క్రీడల్లోనూ మనవాడిని మించిన ఫిట్టస్ట్ ప్లేయర్ లేడు. ఇది అందరికి తెలిసిన విషయమే.. అయితే వింత వ్యాఖ్యలకు, అర్థంపర్థం లేని మాటలకు కేరాఫ్‌గా నిలిచే పాక్ మాజీ క్రికెటర్లు మరోసారి తమ తింగరితనాన్ని బయటపెట్టుకున్నారు. పాక్ మాజీ కెప్టెన్, లెజండరీ ప్లేయర్ షాహిద్ అఫ్రిది(Shahid afridi) మరోసారి ట్రోల్‌కి గురయ్యాడు.
పూర్తిగా చదవండి..World cup 2023: పాకిస్థాన్ లెజెండ్ అతి..! మాంసం తింటే మ్యాచ్‌లు గెలుస్తారా? మరి మీరేం గెలిచారు..?
టీమిండియా క్రికెటర్లు బలంగా మారడానికి మాంసం కారణమని పాక్ లెజెండ్ షాహీద్ అఫ్రిది చేసిన కామెంట్స్‌పై నెటిజన్లు భిన్నరకాలుగా చర్చించుకుంటున్నారు. అఫ్రిది అభిప్రాయం సరైనది కాదని కొంతమంది చెబుతుండగా.. లేదు లేదు కరెక్ట్‌గానే చెప్పాడని మరికొందరు అంటున్నారు. అయితే శాఖాహారం అయినా మాంసాహారమైనా ఫిట్నెస్ కోసమేనని.. నాన్‌వెజ్ తినే క్రికెటర్లు కంటే వెజ్ తినే కోహ్లీ ఫిట్‌గా ఉంటాడని.. అఫ్రిది మాటలు తింగరిగా ఉన్నాయని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

Translate this News:












