ప్రపంచకప్‌లో రికార్డుల మోత కొనసాగుతోంది. దాదాపు ప్రతీమ్యాచ్‌లోనూ ఏదో ఒక రికార్డు నమోదవుతుంది. తాజాగా ఆసీస్ స్టార్ బ్యాటర్ గ్లెన్ మాక్స్వెల్ వండర్ క్రియేట్ చేశాడు. ప్రపంచకప్ చరిత్రలో వేగవంతమైన సెంచరీ నమోదు చేశాడు. నెదర్లాండ్స్‌పై మ్యాచ్‌లో ఈ రికార్డు నెలకొల్పాడు. ఢిల్లీ వేదికగా ఈ మ్యాచ్ జరిగింది. కేవలం 40 బంతుల్లోనే 100 రన్స్ చేశాడు మాక్స్వెల్. ఇది ప్రపంచకప్‌లో ఫాస్టెస్ సెంచరీ.. గతంలో ఈ రికార్డు దక్షిణాఫ్రికా బ్యాటర్ ఐడెన్ మార్క్రామ్ పేరిట ఉంది. ఈ వరల్డ్‌కప్‌లోనే శ్రీలంకపై జరిగిన మ్యాచ్‌లో మార్క్రామ్ ఈ ఫీట్ సాధించాడు. కొన్ని రోజులకే ఈ రికార్డు బ్రేక్ అయ్యింది. గతంలో ఈ రికార్డు ఐర్లాండ్ స్టార్ కెవిన్ ఓ’బ్రియన్ పేరట ఉండేది. 2011 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌పై కెవిన్ 50 బంతుల్లో 100 పరుగులు చేశాడు. ఆ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓడిపోయింది. ఇక తాజాగా మార్క్రామ్ రికార్డుతో పాటు కెవిన్ ఓ బ్రియన్ రికార్డును కూడా బ్రేక్ చేశాడు మాక్స్వెల్(Glen Maxwell). మొత్తంగా 44 బంతుల్లో 106 రన్స్ చేసిన మాక్సీ ఖాతాలో 9 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి.
పూర్తిగా చదవండి..World cup 2023: ఇదేం కొట్టుడు సామీ.. వరల్డ్‌కప్ హిస్టరీలో ఫాస్టెస్ సెంచరీ..!
వరల్డ్‌కప్‌లో మరో రికార్డు నమోదైంది. ప్రపంచకప్ చరిత్రలో వేగవంతమైన సెంచరీని రికార్డు చేశాడు ఆసీస్ స్టార్ హిట్టర్ గ్లెన్ మాక్స్వెల్. ఢిల్లీ వేదికగా నెదర్లాండ్స్‌పై జరిగిన మ్యాచ్‌లో కేవలం 40 బంతుల్లోనే సెంచరీ చేశాడు. ఈ ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్ ఐడెన్ మార్క్రామ్ 49 బంతుల్లో సెంచరీ చేయగా.. ఇప్పుడా రికార్డును మాక్సీ లేపేశాడు.

Translate this News:











