SR Nagar Tarun Incident: హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లో తరుణ్ అనే యువకుడి దారుణ హత్య సంచలనంగా మారింది. బండరాళ్లతో మోది హత్య చేశారు దుండగులు. అయితే, తరుణ్‌ను చంపింది రౌడీషీటర్ షరీఫ్ గ్యాంగ్ అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కామన్ ఫ్రెండ్స్ ద్వారా తరుణ్‌ను పార్టీకి పిలిచి అతడిపై మూకుమ్మడి దాడి చేసి హత్య చేసినట్లు తెలుస్తోంది. తరుణ్ హత్యకు పాతకక్షలే కారణమని అనుమానిస్తున్నారు పోలీసులు. గాంధీ హాస్పటల్లో తరుణ్ మృతదేహానికి అధికారులు పోస్టు మార్టం నిర్వహిస్తున్నారు.
పూర్తిగా చదవండి..హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లో దారుణ హత్య జరిగింది. తరుణ్ అనే యువకుడిని అతి కిరాతకంగా హత్య చేసారు రౌడీషీటర్ షరీఫ్ గ్యాంగ్. పాతకక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగిదంటూ తరుణ్ తండ్రి వాపోతున్నాడు. ఫుడ్ తిని నిద్రపోతున్న తన కొడుకును కామన్ ఫ్రెండ్స్ ద్వారా షరీఫ్ పార్టీకి పిలిపించుకుని ఈ హత్య చేసాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాసారం బస్తీలో మద్యం తాగుతుండగా షర్మీఫ్ గ్యాంగ్ దాదాపు 50 మంది మూకుమ్మడిగా తరుణ్ పై దాడి చేసారని ఆరోపించారు. బండరాళ్లతో మోది తన కొడుకుని చంపేసారని విలపిస్తున్నాడు.
Also Read: ఈ బండి మీదనే పాలమ్మిన.. స్కూటర్ నడిపి సందడి చేసిన మల్లారెడ్డి!
రౌడీషీటర్ షరీఫ్ ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలుపుతున్నారని..అయితే అతడిని అరెస్ట్ చేసినట్లు సరైన ఆధారాలు చూపించడం లేదని బాధత తండ్రి వాపోతున్నాడు. షర్మీఫ్ ను అరెస్ట్ చేసిన పాత ఫొటోలు చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యువకులకు గంజాయి సప్లై చేస్తూ గ్యాంగ్ నడుపుతున్న షరీఫ్ కచ్చితంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.అతిడికి సహకరించిన గ్యాంగ్ ను కూడా అదుపులోకి తీసుకోవాలని తరుణ్ తండ్రి కోరుతున్నాడు.
[vuukle]











