House Rents in Hyderabad: ‘ఏం కొనేటట్లు లేదు.. ఏం తినేటట్లులేదు’.. పాట గుర్తుందా? ఇప్పుడు ఆ పాటను మార్చుకోవాల్సిన తరుణం వచ్చింది. ‘ఏం చేసేటట్లు లేదు.. ఏడ వుండేటట్లు లేదు’ అంటూ పాటను మార్చుకుని పాడాల్సిన పరిస్థితి హైదరాబాద్(Hyderabad) ప్రజలకు వచ్చింది. అవును మరి.. నగరంలో రూమ్ రెంట్స్(Room Rents) ఆకాశన్నంటుతున్నాయి ఇప్పుడు. సగటున 25 నుంచి 45 శాతం వరకు రెంట్స్ పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. ముఖ్యంగా నగరం పశ్చిమ వైపున అంటే గచ్చిబౌలి, కొండాపూర్, మియాపూర్, హై-టెక్ సిటీ వంటి ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు.. ఆకస్మికంగా పెరిగిన ధరలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెరిగిన రూమ్ రెంట్స్తో.. వచ్చిన శాలరీతోనే అన్నీ కవర్ చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఐటీ, ఫైనాన్స్, ఫార్మా రంగాలలో ఎక్కువ ఉపాధి పొందుతున్న వలస కార్మికులు.. ఈ ప్రదేశాలలో ఎక్కువగా ఉంటున్నారు. అయితే, పెరిగిన ఇంటి అద్దెలతో కార్మికులు ఆందోళనకు గురవుతున్నారు.
పూర్తిగా చదవండి..Hyderabad: ఇలా అయితే ఎలా బతికేది.. హైదరాబాద్లో చుక్కలనంటుతున్న రూమ్ రెంట్స్.. 2బీహెచ్కే ధర ఎంతో తెలుసా?
హైదరాబాద్ దినదినాభివృద్ధి చెందడం, మౌలిక వసతులు పెరగడం.. కరోనా నేపథ్యంలో వర్క్ ఫ్రమ్ కారణంగా తమ తమ స్వస్థలాలకు వెళ్లిన ఉద్యోగులు.. ఇప్పుడు తిరిగి ఆఫీసులకు వస్తుండటం, స్కూల్స్, కాలేజెస్ అన్నీ తెరుచుకోవడం వల్ల నగరంలో రూమ్స్ కి డిమాండ్ బాగా పెరిగిపోయిందని రియల్టర్స్ చెబుతున్నారు.

Translate this News:











