Independence day Hyderabad Metro Super Saver Offer: సందర్భానికి తగ్గట్టుగా.. పండుగల సమయంలో..వివిధ రకాల ఆఫర్లు ప్రకటిస్తూ ప్రయాణికులకు దగ్గరయ్యే హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro) మరో అదిరిపోయే ఆఫర్‌తో ముందుకొచ్చింది. ఈ ఆఫర్ ఇప్పటికే మొదలైపోయింది కూడా. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రయాణికులకు బంపర్ ఆఫర్(Independence Day Offer) ఇచ్చింది. కేవలం 59 రూపాయలకే నగరాన్ని చుట్టేసే ఆఫర్‌ని రన్ చేస్తోంది. ఈ ఆఫర్ ఇవాళ (ఆగస్టు 12), రేపు (ఆగస్టు 13)తో పాటు ఆగస్టు 15న అందుబాటులో ఉంటుంది. దీనికి ఫ్రీడమ్ ఆఫర్ అని పేరు పెట్టింది. అమీర్‌పేట్ మెట్రో స్టేషన్ దగ్గర జరిగిన కస్టమర్ లాయల్టీ ప్రోగ్రామ్ ఈవెంట్లో ఈ ఆఫర్‌ని ప్రారంభించారు మెట్రో రైలు ఎండీ కేవీబీ రెడ్డి.
పూర్తిగా చదవండి..Metro: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు బంపర్ ఆఫర్.. రూ.59కే నగరాన్ని చుట్టేయండి!
హైదరాబాద్ మెట్రో సూపర్ సేవర్ ఆఫర్ ప్రకటించింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ ఆఫర్ మూడు రోజుల పాటు అందుబాటులో ఉంటుంది. రూ.59 రీఛార్జ్‌కే ఆగస్టు 12,13, 15 తేదీల్లో నగరంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణింవచ్చు. ఆగస్టు 14న ఈ ఆఫర్ అందుబాటులో ఉండదు. అమీర్‌పేట్ మెట్రో స్టేషన్ దగ్గర జరిగిన కస్టమర్ లాయల్టీ ప్రోగ్రామ్ ఈవెంట్లో మెట్రో రైలు ఎండీ కేవీబీ రెడ్డి ఈ ఆఫర్‌ని ప్రారంభించారు .

Translate this News:











