IT Employees Protest in Hyderabad Over Chandrababu Arrest: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా హైదరాబాద్ హైటెక్ సిటీలో (Hitech City) ఐటీ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. గచ్చిబౌలి విప్రో సర్కిల్ (Wipro Circle) వద్ద టెకీలు నల్ల రిబ్బన్లు ధరించి నిరసనకు దిగారు. పెద్ద ఎత్తున జై చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు. చంద్రబాబు అరెస్ట్ అక్రమం, అన్యాయం అని మండిపడ్డారు. చంద్రబాబు కోసం కాదు ఏపీ అభివృద్ధి కోసం ప్రజలందరూ బయటకు రావాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్ అభివృద్ధిలో చంద్రబాబు పాత్ర కీలకమని గుర్తుచేశారు. ఆయన వల్లే ఐటీ అభివృద్ధి చెందిందని.. ఎంతో మంది యువత నేడు ఉపాధి పొందుతున్నారని తెలిపారు.
పూర్తిగా చదవండి..IT Employees: చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారు.. హైదరాబాద్లో ఐటీ ఉద్యోగుల నిరసన
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా హైదరాబాద్ హైటెక్ సిటీలో ఐటీ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. గచ్చిబౌలి విప్రో సర్కిల్ వద్ద టెకీలు నల్ల రిబ్బన్లు ధరించి నిరసనకు దిగారు. పెద్ద ఎత్తున జై చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు. చంద్రబాబు అరెస్ట్ అక్రమం, అన్యాయం అని మండిపడ్డారు.

Translate this News:











