హైదరాబాద్ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో నగరంలోని అనేక ప్రాంతాలు నీట మునిగాయి. తాజాగా నగరంలో కురుస్తున్న భారీ వర్షానికి నాంపల్లి ఓల్డ్ మలేపల్లిలో గల పసకల(పచ్చ కామెర్ల) అస్పత్రిలో నీరు చేరింది. వరద నీటితో ఆస్పత్రి ప్రాంగణం అంతా చెరువును తలపిస్తోంది. కాగా వరద గంట గంటకూ ఎక్కువ అవుతుండటంతో అక్కడ వైద్య సేవలకు అంతరాయం ఏర్పడుతోంది. వరదల వల్ల తాము వైద్యం చేయించుకోలేకపోతున్నామని పచ్చకామెర్ల వైద్యం కోసం వచ్చిన రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పూర్తిగా చదవండి..హైదరాబాద్‌ను వదలని వాన.. నీట మునిగిన ఆస్పత్రి
హైదరాబాద్‌ను వర్షం వదలడం లేదు. నగరంలో ఏకధాటిగా కురుస్తున్న వర్షానికి నాంపల్లిలోని పసకల ఆస్పత్రి నీటమునిగింది. దీంతో పచ్చకామెర్ల వైద్యం కోసం ఆస్పత్రికి వచ్చిన రోగులు ఇబ్బందులకు గురవుతున్నారు.

Translate this News:











