ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు తెలంగాణకు వస్తున్నారు. మహబూబ్‌నగర్‌లో పర్యటించి రూ.13.500 కోట్లపలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. సీఎం కేసీఆర్ ఈసారి కూడా ప్రధానికి స్వాగతం పలకడం లేదు. ఇక, హైదరాబాద్‌లో మరోసారి మోదీ పర్యటన నేపథ్యంలో ఆయనకు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. దీనిపై గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు.
పూర్తిగా చదవండి..Raja Signh: అలా చేసి అభాసుపాలు కావొద్దు.. బీఆర్ఎస్కు రాజా సింగ్ వార్నింగ్
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లకు ఎమ్మెల్యే రాజా సింగ్ సవాల్ విసిరారు. కేసీఆర్, కేటీఆర్‌లకు దమ్ముంటే మోదీని కలవాలన్నారు. ప్రధానిని కలసి తెలంగాణకు కావాల్సిన ప్రాజెక్టులను కేసీఆర్ అడగాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రానికి ఏం నిధులు కావాలో ప్రధానని కలిసి ఎందుకు అడగటం లేదు?.. అని ప్రశ్నించారు. ప్రధానికి ముఖం చూపించుకోలేకనే బీఆర్ఎస్ ప్రభుత్వం అనవసర విమర్శలు చేస్తున్నారని గోషామాల్ ఎమ్మెల్యే ఫైర్ అయ్యారు.

Translate this News:











