గణేశ్ ఉత్సవాలు అంటేనే హైదరాబాద్ స్పెషల్. నిమజ్జనం రోజు సాగే శోభాయాత్ర ఇంకా స్పెషల్. డ్యాన్స్ లు కేరింతలతో గణేశుడికి ఘనంగా వీడ్కోలు పలుకుతూ ఉంటారు భక్తులు. అయితే.. ఈ సారి శోభాయాత్రలో స్పెషల్ గా నిలిచారు పోలీసులు. కేవలం బందోబస్తుకు మాత్రమే పరిమితం కాకుండా తమ డ్యాన్స్ తో దుమ్ము లేపారు హైదరాబాద్ ఖాకీలు. ఈ సారి శోభాయాత్రలో అనేక చోట్ల పోలీసులు చేసిన డ్యాన్స్ హైలెట్ గా నిలిచింది. ఎప్పుడు సీరియస్ గా కనిపించే పోలీసులు తమతో కలిసి హుషారుగా డ్యాన్స్ చేయడంతో భక్తులు మరింత ఉత్సాహంగా స్టెప్పులు వేశారు. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పోలీసుల డ్యాన్స్ బాగుందంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఉత్సవం ఏదైనా.. ప్రశాంతంగా నిర్వహించడం తెలంగాణ పోలీసులకే సాధ్యం అంటూ కితాబిస్తున్నారు మరి కొందరు.
పూర్తిగా చదవండి..Viral Video: డీజే టిల్లూ పాటకు పోలీసుల దుమ్ములేపే డ్యాన్స్.. ఈసారి నిమజ్జనంలో హైలెట్ ఇదే!
కేవలం బందోబస్తుకు మాత్రమే పరిమితం కాకుండా తమ డ్యాన్స్ తో దుమ్ము లేపారు హైదరాబాద్ ఖాకీలు. ఈ సారి శోభాయాత్రలో అనేక చోట్ల పోలీసులు చేసే డ్యాన్స్ హైలెట్ గా నిలిచింది. ఎప్పుడు సీరియస్ గా కనిపించే పోలీసులు తమతో కలిసి హుషారుగా డ్యాన్స్ చేయడంతో భక్తులు కేరింతలు కొట్టారు.

Translate this News:











