Cikkadapalli CI Suspend: ప్రవళిక విషాదాంతం నేపథ్యంలో చిక్కడపల్లి సీఐ నరేష్ ను సస్పెండ్ చేస్తూ ఆదివారం హైదరాబాద్ కమిషనర్ సందీప్ శాండిల్య ఉత్తర్వులు జారీ చేసారు. వరంగల్ కు చెందిన ప్రవళిక 15 రోజుల క్రితం హైదరాబాద్ వచ్చి అశోక్ నగర్లోని బృందావన్ హాస్టల్లో ఉంటూ పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే. కాగా, శుక్రవారం ప్రవళిక హాస్టల్ గదిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. గ్రూప్ 2 పరీక్షలు వాయిదా పడటం వల్లనే ఆమె ప్రాణం తీసుకుందన్న వార్త దావానలంలా వ్యాపించటంతో ఆరోజు రాత్రి వేల సంఖ్యలో విద్యార్థులు అక్కడ గుమిగూడి ఆందోళన జరిపారు. ఒక దశలో పోలీసులపై రాళ్లు కూడా రువ్వారు. వేర్వేరు పార్టీలకు చెందిన నాయకులు ప్రవళికది ప్రభుత్వం చేసిన హత్య అంటూ తీవ్ర విమర్శలు చేసారు. దీనికి కారణం చిక్కడపల్లి సీఐ నరేష్ సకాలంలో స్పందించక పోవటమే అంటూ కమిషనర్ కు నిఘా వర్గాలు నివేదిక ఇచ్చినట్టు సమాచారం. విషయం తెలిసిన వెంటనే ప్రవళిక మృతదేహాన్ని హాస్టల్ నుంచి మార్చురీకి తరలించి ఉంటే ఇంత గొడవ జరిగి ఉండేది కాదని ఆ నివేదికలో పేర్కొన్నట్టు తెలిసింది. దీని ఆధారంగానే సీఐని సస్పెండ్ చేస్తూ కమిషనర్ ఉత్తర్వులు ఇచ్చారు.
పూర్తిగా చదవండి..Hyderabad: ప్రవళిక మృతి ఘటనలో నిర్లక్ష్యం.. చిక్కడపల్లి సీఐపై సస్పెన్షన్ వేటు..
ప్రవళిక విషాదాంతం నేపథ్యంలో చిక్కడపల్లి సీఐ నరేష్ ను సస్పెండ్ చేస్తూ ఆదివారం హైదరాబాద్ కమిషనర్ సందీప్ శాండిల్య ఉత్తర్వులు జారీ చేసారు. వరంగల్ కు చెందిన ప్రవళిక 15 రోజుల క్రితం హైదరాబాద్ వచ్చి అశోక్ నగర్లోని బృందావన్ హాస్టల్లో ఉంటూ పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే. కాగా, శుక్రవారం ప్రవళిక హాస్టల్ గదిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

Translate this News:











