రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఎల్బీనగర్ ఆర్టీసీ కాలనీలో దారుణం చోటుచేసుకుంది. ఓ ఇంట్లోకి చొరబడిన యువకుడు.. అక్కా తమ్ముడిపై కత్తితో దాడి చేశాడు. అగంతకుడి దాడిలో తీవ్రంగా గాయపడిన తుమ్ముడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆదివారం మధ్యాహ్నం సమయంలో ఆర్టీసీ కాలనీలో ఉన్న యువతి ఇంటికి ఓ యువకుడు వచ్చాడు. ఐ విల్ కిల్ యూ బంగారం అంటూనే తన వెంట తెచ్చుకున్న కత్తిని బయటకు తీశాడు. ఆ వెంటనే పక్కనే ఉన్న సంఘవి మెడ, మొహం, చేతులపై దాడి చేశాడు. దాంతో ఆమె తీవ్రంగా గాయపడింది. అక్కపై దాడితో అలర్ట్ అయిన తమ్ముడు చింటు నిందితుడిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. అతనిపైనా దాడి చేశాడు. ఈ క్రమంలో చింటూ, నిందితుడి మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఇంట్లో ఉన్న అద్దాలన్నింటినీ నిందితుడు పగలకొట్టాడు. అయితే, నిందితుడి దాడి నుంచి తప్పించుకునేందుకు సంఘవి, చింటూ ఇద్దరూ తమ ఇంటి నుంచి బయటకు పరుగులు తీశారు. అయినప్పటికీ వారిని వెంబడించాడు నిందితుడు శివకుమార్. అది గమనించిన చుట్టుపక్కల వారు కర్రలతో వచ్చి నిందితుడిని కొట్టి.. ఇంట్లో బంధించి తాళం వేశారు. ఆ వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని నిందితుడుని అదుపులోకి తీసుకున్నారు.
పూర్తిగా చదవండి..Hyderabad: హైదరాబాద్లో ప్రేమోన్మాది ఘాతుకం.. ‘బంగారం’ అంటూనే..
ఓ వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి కత్తితో బీభత్సం సృష్టించాడు. ఇంట్లో ఉన్న యువతిపై దాడి చేశాడు ఓ ప్రేమోన్మాది. అడ్డం వచ్చిన వారిని సైతం లెక్క చేయకుండా ప్రాణాలు తీశాడు. ఈ ఘటన ఎల్బీనగర్ ఆర్టీసీ కాలనీలో కలకలం రేపుతోంది. తమ్ముడి ప్రాణాలు పోగా..భయటకు పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకుంది సంఘవి.

Translate this News:











